Aryan Khan : కొడుక్కి తండ్రి మనీ ఆర్డర్, వీడియో కాల్‌లో కన్నీటిపర్యంతం

గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్‌.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే..

Aryan Khan : కొడుక్కి తండ్రి మనీ ఆర్డర్, వీడియో కాల్‌లో కన్నీటిపర్యంతం

Aryan Khan

Aryan Khan : బాలీవుడ్ బాద్ షా కొడుకు ఆర్యన్ ఖాన్(23) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, ముంబై జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు.. తన తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది ముంబై కోర్టు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో ఆర్యన్ మాట్లాడాడు. గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్‌.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వెసులు బాటు ఉంటుంది. అలాగే ఆర్యన్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్ అవకాశం కల్పించారు. అధికారుల పర్యవేక్షణలో 10 నిమిషాల పాటు ఆర్యన్ వీడియో కాల్ లో మాట్లాడాడు.

మరోవైపు ఆర్యన్ ఖాన్ రూ. 4,500 మనీ ఆర్డర్ పొందాడు. ఇంటి నుంచి ఈ డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో జైలు క్యాంటీన్ నుంచి ఆహారం, ఇతర వస్తువులు ఆర్యన్ కొనుక్కోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్యన్ కు జైలు ఆహారాన్నే అందిస్తున్నారు అధికారులు. జైల్లో ఉన్న వ్యక్తికి గరిష్టంగా రూ. 4,500 మాత్రమే మనీ ఆర్డర్ చేయడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ నిబంధనలకు లోబడే షారూఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్‌కు మనీ ఆర్డర్ చేశాడు.

Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

కాగా, ఆర్యన్ ఖాన్‌కు జైలు ఆహారాన్నే అందిస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఇది మినహా ఇంటి ఆహారం లేదా బయటి ఆహారాన్ని అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలు వెలువడే వరకు జైలు ఆహారమే అందిస్తామని స్పష్టం చేశారు.

ఇకపోతే ఆర్యన్ బెయిల్‌ విచారణ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్‌ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. బెయిల్‌ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు తీర్పును అక్టోబర్‌ 20వ తేదీ వరకు రిజర్వ్‌లో పెట్టింది. దీంతో ఆర్యన్‌ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్‌ రోడ్‌ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే.

ఆర్యన్ బెయిల్‌ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టులో రెండు రోజులు వాడీవేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది. ఆర్యన్ రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకునేవాడని, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో టచ్‌లో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడం సరికాదని, బెయిల్‌పై బయటకు వెళ్తే ఆధారాలను రూపుమాపే ప్రమాదం ఉందని వాదించారు. కాగా, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ఆ వాదనలను కొట్టిపారేశారు.

Vitamin B12 : విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనం తెలుసా?..

ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌‌ ఆధారంగా ఇలాంటి వాదనలు చేయడం సరికాదన్నారు. ఇప్పటి యువత వాడే భాష విభిన్నంగా ఉంటుందన్నారు. తన క్లయింట్ డ్రగ్స్ తీసుకోడని, అరెస్ట్ చేసినప్పుడూ అతడి దగ్గర డ్రగ్స్ లేవని అన్నారు. ఈ దశలో తాము తమ క్లయింట్ నిర్దోషి అని వాదించడం లేదని, కానీ, ఇప్పుడు బెయిల్ కోసమే వాదిస్తున్నామని, ప్రస్తుత పంచనామా పత్రాల ఆధారంగానైనా బెయిల్ ఇవ్వకుండా జైలుకే పరిమితం చేయాల్సిన పనిలేదని వాదించారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడా లేదన్నారు.

అక్టోబర్ 2 న ముంబై నుండి గోవా వెళ్తున్న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. షారుఖ్ కొడుకు ఆర్యన్‌తో పాటు 8మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హషిష్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5గ్రాముల ఎండీ, 6 గ్రాముల చరాస్ ను స్వాధీనం చేసుకున్నారు.