Shivraj Chouhan : రాహుల్ ఉన్నంతకాలం బీజేపీకి ఇబ్బందే లేదు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.

Shivraj Chouhan : రాహుల్ ఉన్నంతకాలం బీజేపీకి ఇబ్బందే లేదు

Sivraj

Shivraj Chouhan వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. బుధవారం పృధ్వీపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చౌహాన్…కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచడానికి రాహుల్ గాంధీ ఒక్కరు చాలని చౌహాన్ అన్నారు. పటిష్టంగా ఉన్న పంజాబ్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చేజేతులా నాశ‌నం చేశార‌ని, నవజ్యోత్ సింగ్ సిద్ధూ కారణంగానే కెప్టెన్ అమరీందర్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని.. ఇప్పుడు సిద్ధూ కూడా పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో రాహుల్ ఉన్నంత‌కాలం బీజేపీ పెద్దగా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేద‌ని శివరాజ్ సింగ్ చమత్కరించారు.

ALSO READ  భారీ భద్రత నడుమ..భవానీపూర్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం
మరోవైపు, పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ మంగళవారం రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే ఆమోదించకుండా బుధవారం రాత్రి వరకూ పునరాలోచించుకునే అవకాశం ఇచ్చింది. అప్పటికీ సిద్ధూ ఒక నిర్ణయానికి రానిపక్షంలో సిద్ధూ స్థానంలో పీపీసీసీ చీఫ్‌ పగ్గాలు మరొకరికి అప్పగించే అవకాశాలున్నాయని, కెప్టెన్‌కు సన్నిహితుడైన సునీల్ జాఖడ్‌కు లేదా లాల్ సింగ్ కు పార్టీ చీఫ్ పగ్గాలు ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చన్ని సిద్ధూ వ్య‌వ‌హారంపై స్పందించారు. తాను సిద్ధూతో ఫోన్‌లో మాట్లాడాన‌ని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా అన్ని విష‌యాలూ ప‌రిష్కరించుకుందామ‌ని ప్ర‌తిపాదించినట్లు తెలిపారు.