Karnataka Elections: ప్రధాని ‘జై బజరంగ్ బలి’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌నూ వదల్లేదు..

మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.

Karnataka Elections: ప్రధాని ‘జై బజరంగ్ బలి’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌నూ వదల్లేదు..

Asaduddin Owaisi

Karnataka Elections: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జై బజరంగ్ బలి నినాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హిందుత్వ సంస్థ ‘భజరంగ్ దళ్’‌ను నిషేధిస్తామని ప్రధాన హామీగా పేర్కొంది. అంతేకాదు భజరంగ్ దళ్‌కు పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ హామీని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన హస్త్రంగా చేసుకుంది. దీంతో అసలైన హిందుత్వ పార్టీ మాదంటే మాదంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.

Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో

 ప్రధాని మోదీ జై బజరంగ్ బలి నినాదం..

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో, ర్యాలీలో మోదీ పాల్గొని బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పలు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగిస్తూ.. భారతమాతను కీర్తిస్తూ, భారత్ మాతాకీ జైతో పాటు జై బజరంగ్ బలి నినాదాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని హామీ ఇవ్వటంతో కౌంటర్ గా ప్రధాని మోదీ బజరంగ్ బలి అనే నినాదాన్ని ప్రస్తావించినట్లయింది.

Karnataka Elections 2023: బీజేపీ ఉచిత పథకాల జపం దేనికి సంకేతం.. హస్తం పార్టీ ట్రాప్‌లో బీజేపీ చిక్కుకుందా?

ఒవైసీ మండిపాటు ..

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈసారి మీరు (ప్రజలు) ఏమి చేస్తారు? మీరు వారిని (కాంగ్రెస్ పార్టీ) శిక్షిస్తారా? మీరు వారిని శిక్షిస్తారా? మీరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి బటన్ నొక్కే ముందు జై బజరంగ్ బలి అని చెప్పి బీజేపీకి ఓటువేసి వారిని శిక్షించాలి అంటూ ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నందుకు బీజేపీ, కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ బజరంగ్ బలి నినాదంపై .. తక్బీర్ నినాదాలు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటేస్తే జై బజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తూ ఓటేయండి అని చెబుతున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అంటూ విమర్శించారు.

 

 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని హనుమాన్ దేవాలయాలు నిర్మిస్తామని చెబుతుంది.. హుబ్లీలో కూల్చివేసిన దర్గాను పున:నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుందా? అంటూ ఓవైసీ ప్రశ్నించారు. బీజేపీతో సైద్దాంతిక పోరులో కాంగ్రెస్ లొంగిపోయిందని అన్నారు. తక్బీర్‌లు చెప్పమని నేను ప్రజలను కోరితే.. మోదీకి సమ్మతమేనా? అదే జరిగితే.. ఆకాశం పడిపోతుందని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటానికి కాంగ్రెస్, బీజేపీ ఇష్టపడవు. కానీ ఎవరు పెద్ద హిందువు అని పోరాడుతున్నారంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు.

మే10న  పోలింగ్ .. 

మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కర్ణాటకపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ‌తో విజయం సాధించడం ద్వారా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది.