Asaduddin Owaisi : భారత జట్టులో 11మంది ఆటగాళ్లుంటే కేవలం ముస్లింనే దూషిస్తున్నారు

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని

Asaduddin Owaisi : భారత జట్టులో 11మంది ఆటగాళ్లుంటే కేవలం ముస్లింనే దూషిస్తున్నారు

Asaduddin Owaisi

Asaduddin Owaisi : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మర్చిపోయి భారత ఆటగాళ్లపై బూతులతో మాటల దాడికి దిగారు. క్రికెటర్లను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఆ దూషణలో మతపరమైన కోణం తీవ్రంగా కనిపిస్తోంది.

మరీ ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. షమీ విసిరిన ఓవర్లోనే పాక్ గెలుపు పరుగుల సాధించి సంబరాలు చేసుకుంది. దాంతో షమీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ ద్రోహి, పాకిస్తాన్ వెళ్లిపో, పాకిస్తాన్ నుంచి ఎంత డబ్బు తీసుకున్నావ్ అంటూ షమీని ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో షమీకి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బాసటగా నిలిచారు.

T20 World Cup 2021: టీమిండియా మరీ ఇంత చెత్త ప్రదర్శన.. ఓటమి కాదిది ఘోర పరాభవం

షమీని దూషించడాన్ని ఒవైసీ తప్పుపట్టారు. భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లింలపై విద్వేషం, వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. క్రికెట్ లో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ఆటగాడినే లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని వాపోయారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుందా? అని ఒవైసీ ప్రశ్నించారు.

”దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోంది. మైనారిటీ మతస్తులను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను రాజకీయంగా ఉపయోగించుకునే రాజకీయాలు చెలరేగుతున్నాయి. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? కశ్మీర్‌లో భారతీయులు, జవాన్లు చనిపోతున్నారు. పక్క దేశం నుంచి వస్తున్న ఉగ్రవాదులు మన దేశస్తుల ప్రాణాలు తీస్తున్నారు. అదే ఉద్రిక్త వాతావరణం భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఆటల్లోనూ కనిపిస్తోంది. జట్టులో 11 మంది ఆటగాళ్లలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారు. అలాంటప్పుడు ఓటమికి ఒక వ్యక్తి ఎలా బాధ్యుడు అవుతాడు? ముస్లింలపై ద్వేషాన్ని పెంచి పోషించి రాజకీయంగా లబ్ది పొందే కుట్రల్లో భాగం ఇది’’ అని ఓవైసీ ఆరోపించారు.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

11 మంది ఆటగాళ్లు ఉన్న జట్టులో మహమ్మద్ షమీపై మాత్రమే ఆరోపణలు చేయడానికి కారణం అతడు ఒక ముస్లిం వ్యక్తి అయ్యుండటమేనా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. షమీ ముస్లిం కావడం వల్లే అతడిపై ట్రోల్స్ చేస్తున్నారని మండిపడిన అసదుద్దీన్ ఒవైసి.. ఈ వైఖరిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు ఖండించగలదా అని నిలదీశారు.

షమీనే కాదు కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా నెటిజన్లు వదల్లేదు. కోహ్లికి సంబంధించిన ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీసం లేకుండా గడ్డంలో ఉన్న విరాట్ కోహ్లీ ఇమేజ్‌ను షేర్ చేస్తూ ‘విరాటుద్దీన్ కోహ్ అలీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. షమీ పరిస్థితి మరీ ఇబ్బందికరం. 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని వారికి సోషల్ మీడియాలో టార్గెట్‌గా మారిపోయాడు. సోషల్ మీడియాలో షమీ టైమ్ లైన్‌లోనే అతడి పోస్టుల కింద బూతు రాతలతో పోస్టులు పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు షమీకి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో షమీపై జరుగుతున్న దాడిని ఖండించారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం షమీకి అండగా నిలిచాడు. ఆటగాళ్లపై ఆన్‌లైన్ మాబ్ ఎటాక్ కరెక్ట్ కాదని హితవు పలికాడు. ఇండియా క్యాప్ పెట్టుకున్న ప్రతి క్రికెటర్ గుండెలో ఇండియా ఉంటుందని చెప్పాడు. ఇకనైనా సోషల్ మీడియాలో షమీపై దాడిని ఆపాలన్నాడు. ”వచ్చే మ్యాచ్‌లో రెచ్చిపోయి నువ్వేంటో చూపించు షమీ” అంటూ ప్రోత్సహిస్తూ ట్వీట్ చేశాడు.