Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విజయం గురించి ఏమన్నారంటే..

కర్ణాటక రాష్ట్రంలో 13శాతం ఉన్న ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో పోటీ చేసింది. రెండు స్థానాల్లోనూ..

Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విజయం గురించి ఏమన్నారంటే..

Asaduddin Owaisi

Asaduddin Owaisi: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి భారీ స్థాయిలో సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. సీఎం పీఠంకోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్యలు పోటీ పడుతున్న విషయం విధితమే. వీరిలో ఒకరిని సీఎంగా ప్రమాణ స్వీకారానికి కొద్దిగంటల ముందు పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

MVA Meet: మహారాష్ట్రకు కిక్ ఇచ్చిన కర్ణాటక.. పవార్ ఇంట్లో ప్రతిపక్షాల కీలక భేటి

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ మస్లీమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రతిఒక్కటీ నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాల్లో మా పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, విజయం సాధించలేక పోయారని అన్నారు. పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇంకా కష్టపడి పనిచేస్తామని చెప్పారు. కర్ణాటక ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ కు అధికారం దక్కిందని, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే ప్రజా వ్యతిరేఖత ఖాయమని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ పాలన సాగించాలని సూచించారు.

Karnataka: మంగళవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. ఇంతకీ కొత్త సీఎం ఎవరో తెలుసా?

కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏఐఎంఐఎం బలోపేతంకు కృషి జరుగుతుందని చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణలో గతంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేస్తామని ఒవైసీ చెప్పారు. ఇదిలాఉంటే, కర్ణాటకలో 13శాతం ఉన్న ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో పోటీ చేసింది. రెండు స్థానాల్లోనూ ధరావతు కోల్పోయింది. ఎన్నికల ముందు జేడీ(ఎస్)తో పొత్తుకు ఈ పార్టీ ప్రయత్నించినా సఫలం కాలేదు.

 

హుబ్బళ్లి ధార్వాడ్ ఈస్ట్ నియోజకవర్గంలో దుర్గప్ప కాశప్పబిజ్‌వాడ్‌ను ఎంఐఎం తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే, అతనికి కేవలం 5,644 (3.81శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అబ్బయ్య విజయం సాధించాడు. బసవన బాగెవాడి స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అల్లాబక్ష్ బిజాపుర్ పోటీ చేయగా.. అతనికి కేవలం 1,472 (0.93)శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడకూడా కాంగ్రెస్ అభ్యర్థి శివానంద్ పాటిల్ విజయం సాధించారు. మరో ముస్లిం పార్టీ ఎస్‌డీపీఐ మొత్తం 16 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయారు.