Prayagraj: అతీక్ అహ్మద్ హత్యపై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తిన అసదుద్దీన్ ఓవైసీ
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్‌లో ఉన్న వెయ్యి ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు

Asaduddin Owaisi
Prayagraj: మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సహా అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను గతవారం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కొత్త ప్రశ్నల్ని లేవనెత్తారు. అతీఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు హంతకులకు ఆటోమాటిక్ ఆయుధాలు ఎలా వచ్చాయని, లక్షల ఖరీదైన పిస్టళ్లను వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రంజాన్ (Ramzan) మాసం చివరి శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఓవైసీ ఈ ప్రశ్నలు లేవనెత్తారు.
BlueTick: మస్క్ మామూలోడు కాదు.. ఏకంగా ట్విట్టర్ స్థాపించినోడి బ్లూటిక్ కూడా తొలగించాడు
హంతకులు మరింతమందిని చంపే అవకాశం ఉందని, అలాంటి ఉగ్ర మనస్తత్వం ఉన్న వాళ్లపై దేశద్రోహ చట్టం కానీ, జాతీయ భద్రతా చట్టం కానీ ఎందుకు పెట్టలేదని ఓవైసీ ప్రశ్నించారు. సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్‌లో ఉన్న వెయ్యి ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిలో చాలా నెంబర్లు ఆఫ్ ఉండటాన్ని పోలీసులు గమనించారు. హంతకులు బస చేసిన హోటల్ వద్ద సిట్ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటికే సిట్ తాత్కాలిక నివేదిక ఆధారంగా అశ్వనీ కుమార్ సింగ్‌ను, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్‌లను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
Karnataka Election 2023 : కర్ణాటకలో మోదీ ఎన్నిక ప్రచారాలు .. 20 బహిరంగ సభల్లో ప్రసంగాలు
ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది. అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ సహా పోలీసులు, మీడియా వేషధారణలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో హత్య జరిగిన ప్రాంతంలోనే జరిగిన తంతును మరోసారి పునర్ణిర్మానం చేసే ప్రయత్నం చేశారు. ఇటు అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య ప్రాణాలకు ముప్పుందని, వారిపై దాడి జరిగే అవకాశముందని పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందిందని తెలిసింది. దీంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు. హంతకులు ప్రస్తుతం పోలీస్ లైన్‌లో ఉన్నారు.