Asaduddin Owaisi : కాల్పుల వెనుక రాజకీయ కారణాలు – అసదుద్దీన్ ఓవైసీ

టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా తమ వాహనాలు స్లో అయ్యాయని చెప్పారు. అంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.

Asaduddin Owaisi : కాల్పుల వెనుక రాజకీయ కారణాలు – అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరగడం సంచలనం రేపింది. దీనిపై ఓవైసీ స్పందించారు. మీరట్, కిఠౌర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేశామని ఓవైసీ తెలిపారు. కార్యక్రమాలు ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యానని వెల్లడించారు. తన కారుకు ముందు ఒక సఫారీ, వెనుకాల రెండు ఫార్చ్యూనర్ వాహనాలున్నాయని.. చిజార్సీ టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా తమ వాహనాలు స్లో అయ్యాయని చెప్పారు. అంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందన్నారు. కాల్పులు జరుగుతున్నాయని మా డ్రైవర్ గ్రహించాడు, వెంటనే మా ముందున్న వాహనాన్ని ఢీ కొడుతూ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు అని వివరించారు.

”మా కారు ఎడమ వైపు రెండు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగినట్టు అర్థమైంది. కాల్పులు జరిపిన వారిలో ఒకరు ఎరుపు జాకెట్, ఒకరు తెలుపు జాకెట్ ధరించి ఉన్నారు. మా వెనకాల ఉన్న ఫార్చ్యూనర్‌లో ఉన్న వాళ్లు దుండగులపైకి వాహనాన్ని తీసుకెళ్లారు. అందులో ఒకరి కాలుపై నుంచి ఫార్చ్యూనర్ వెళ్లింది. తెలుపు జాకెట్లో ఉన్న వ్యక్తి అక్కణ్ణుంచి పారిపోయాడు.

WhatsApp New Update : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. 2 రోజులకు పొడిగించే అవకాశం!

కాసేపటి తర్వాత అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి ఫోన్ చేశాడు. కాల్పులకు పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు యూపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలున్నాయి” అని ఓవైసీ అనుమానం వ్యక్తం చేశారు.

Facebook-Meta : మెటాకు భారీ షాక్.. కంపెనీ చరిత్రలోనే ఫస్ట్ టైం… మిలియన్ల మంది యూజర్లు లాస్..!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అసదుద్దీన్ ఒవైసీ ప్రచారానికి వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. అసద్ వాహనంపై కాల్పులు జరిగాయి. మీరట్ జిల్లా కితౌర్ లో ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాల్పుల అనంతరం దుండగులు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని చెప్పారు.