Asaduddin Owaisi : వినాయక చవితికి మాంసం విక్రయాలు బంద్… తప్పుబట్టిన అసదుద్దీన్

బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.

Asaduddin Owaisi : వినాయక చవితికి మాంసం విక్రయాలు బంద్… తప్పుబట్టిన అసదుద్దీన్

Asaduddin Owaisi : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 31న మాంసం విక్రయాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘‘మాంసం విక్రయాల్ని నిషేధించే నిర్ణయం ప్రభుత్వానికి మంచిదే కావొచ్చు. కానీ, దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుంది’’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వినాయక చవితి సందర్భంగా బెంగళూరు పరిధిలోకి వచ్చే ప్రతి మాంసం విక్రయ కేంద్రాన్ని, కబేళాల్ని మూసివేయాలని ఇటీవలే బెంగళూరు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

CM KCR: ఎల్లుండి బిహార్‌కు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో జాతీయ రాజకీయాలపై చర్చ

గతంలో కృష్ణాష్టమి సందర్భంగా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.