AICC President Election: గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష బరిలో ఎవరూ ఉండరు.. స్పష్టం చేసిన అశోక్ గెహ్లాట్ ..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయితే ...

AICC President Election: గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష బరిలో ఎవరూ ఉండరు.. స్పష్టం చేసిన అశోక్ గెహ్లాట్ ..

Rahul Gandhi

AICC President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయితే రాహుల్ మాత్రం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మరోసారి ససేమీరా అన్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ తెలిపారు. గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ తదుపరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టకూడదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అన్నారు.

Congress President Election: మళ్లీ రాహుల్ జపం..! రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి.. ఆ రాష్ట్రాల్లో ఏకగ్రీవ తీర్మానాలు

గెహ్లాట్ రాహుల్ గాంధీతో గురువారం కేరళలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి రావాలనే అందరి కోరికలను అంగీకరించమని నేను రాహుల్ ను విజ్ఞప్తి చేశానని తెలిపారు. అయితే రాహుల్ మాత్రం అందుకు అంగీకరించలేదని తెలిపాడు. గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి చీఫ్ కాకూడదని తాను నిర్ణయించుకున్నానని రాహుల్ తనకు చెప్పాడని గెహ్లాట్ విలేకరులతో అన్నారు. గాంధీయేతర వ్యక్తే అధ్యక్ష బాధ్యతలు చేపడతారని గెహ్లాట్ అన్నారు.

Earthquake : ఇండోనేషియాలో మరోసారి భూకంపం .. 4.7 తీవ్రతగా నమోదు

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక బరిలో గెహ్లాట్ ముందువరుసలో ఉన్నారు. గత కొద్ది కాలంగా ఆయనే పార్టీ అధినేత అవుతారని చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఆయనకు పోటీగా శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ వంటి పలువురు సీనియర్ నేతలు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ సైతం విడుదలయింది. అక్టోబర్ 1వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడించనున్నారు.