BJP Minority Cell: ముస్లిం ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ రాలేదని మైనారిటీ సెల్ తొలగించిన బీజేపీ

అస్సాంలో బీజేపీ గెలవడానికి ఒక్క ముస్లిం ఓటు కూడా పడలేదనే నిర్ధారణకు వచ్చిన పార్టీ.. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సెల్ యూనిట్ ను తొలగించేందుకు ...

BJP Minority Cell: ముస్లిం ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ రాలేదని మైనారిటీ సెల్ తొలగించిన బీజేపీ

Bjp Minority Cell

BJP Minority Cell: అస్సాంలో బీజేపీ గెలవడానికి ఒక్క ముస్లిం ఓటు కూడా పడలేదనే నిర్ధారణకు వచ్చిన పార్టీ.. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సెల్ యూనిట్ ను తొలగించేందుకు ప్లాన్ చేసింది. 126 అసెంబ్లీ స్థానాల్లో పొత్తు పెట్టుకుని 75సీట్లు గెలవగా అందులో బీజేపీకి 60 సీట్లు వచ్చాయి.

రాష్ట్ర బీజేపీ చీఫ్ రంజిత్ దాస్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల వరకూ మైనారిటీ సెల్ ను రద్దు చేస్తున్నాం.

31-34 ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ 2016లో ఒకే ఒక్క సీట్ దక్కించుకుంది. సదరన్ అస్సాంలోని బరాక్ వాలీకి చెందిన కచ్చార్ జిల్లాలో సోనై నియోజకవర్గం అది. అమీనుల్ హక్ లస్కర్ అక్కడి నుంచే పోటీ చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ అయ్యారు.

ఈ సారి లస్కర్ తో పాటుగా మరో ఎనిమిది మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది బీజేపీ. ప్రతి ఒక్కరు ఎగువ అస్సాం, సెంట్రల్ అస్సాం, కొండ ప్రాంతంలో ఉన్న జిల్లలాకు చెందిన వారిని ఎంచుకుంది. అందరూ ఓడిపోగా లస్కర్ 19వేల 654 ఓట్ల తేడాతో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అభ్యర్థి కరీమ్ ఉద్దీన్ బర్భూయా చేతిలో ఓడిపోయాడు.

బీజేపీ దాని మిత్ర పక్ష పార్టీలు పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు ఓట్లు రాబట్టలేకపోయారు. ఈ ఏడాది అస్సాం అసెంబ్లీలో 24శాతం ముస్లిం ప్రతినిధులు ఉండబోతున్నారు. 31మంది ప్రతిపక్ష పార్టీ నేతలు (16మంది కాంగ్రెస్ + దాని మిత్ర పక్షం మహాజోత్ ఏఐయూడీఎఫ్ 15మంది).