కరోనా కాలపు పెళ్లి..పూలదండలతో పాటు మాస్క్‌లు కూడా మార్చుకుంటున్నారు

  • Published By: nagamani ,Published On : June 6, 2020 / 10:14 AM IST
కరోనా కాలపు పెళ్లి..పూలదండలతో పాటు మాస్క్‌లు కూడా మార్చుకుంటున్నారు

కరోనాకు ముందు కరోనా తరువాత మనుషుల జీవితాల్లో వచ్చిన పెను మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడంతా కరోనా ట్రెండ్. కరోనా అనేది వైరస్ అయినా సరే ఇదే ట్రెండ్ గా మారింది. ప్రతీ విషయంలోనే మార్పులే చోటుచేసుకున్నాయి. మనుషుల అలవాట్లనే కాదు సంప్రదాయాలను కూడా మార్చేసింది కరోనా. 

పెళ్లిలో పెళ్లికూతురు పెళ్లి కొడుకులు పెళ్లిళ్లలో పూల దండలు మార్చుకోవటం సంప్రదాయం.  వధువు వరుడి మెడలో పూలమాల వేస్తుంది.అలాగే వధువు మెడలో వరుడు పూలమాల వేస్తాడు. ఇది సంప్రదాయం. కానీ ఇప్పుడు కరోనా కాలం ట్రెండ్ పెళ్లిళ్లలో కొత్తగా మరొకటి కూడా చోటుచేసుకుంది. వధూవరులు పూల దండలతో పాటు ముఖానికి కట్టుకునే మాస్కులన కూడా మార్చుకుంటున్నారు. వరుడు.. వధువుకు మాస్కు తొడిగితే.. వరుడు తిరిగి ఆమెకు మాస్కు తొడగడం ఇప్పుడు సాంప్రదాయంగా మారింది. అదే కరోనా సంప్రదాయం. 

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ జంట పెళ్లిలో ఇలా ఒకరికొకరు  మాస్కులు మార్చుకున్నారు. ఈ వీడియోను చూసినవారంతా ఇది కలికాలమే కాదు కరోనా కాలం అనుకుంటున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.