ఏదో ఒక రోజు ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ రోషన్

ఏదో ఒక రోజు ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ రోషన్

COVID-19 పేషెంట్లలో పాజిటివ్‌నెస్ తీసుకొచ్చేందుకు డాక్టర్లు చేస్తున్న ఫీట్లు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. అలాగే అస్సాంకు చెందిన ఈ డాక్టర్ చేసిన డ్యాన్స్‌కు హృతిక్ రోషన్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాకుండా ఈ మెడికల్ ప్రొఫెషనల్ ను తెగపొగిడేశాడు.

వార్‌ చిత్రంలో హృతిక్ రోష‌న్ డ్యాన్స్ చేసిన ‘గున్గురూ..’ పాటకు డాక్ట‌ర్ స్టెప్పులేసి అద‌ర‌హో అనిపించాడు. ఈ వీడియోను డాక్టర్ సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే మరో డాక్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌గా.. పలువురు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.



‘నా డ్యూటీ కొలీగ్ ఈఎన్టీ సర్జన్ డా. అరూప్ సేనాపతి అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజిలో చేసిన డ్యాన్స్. కొవిడ్ పేషెంట్లను హ్యాపీగా ఉంచాలని చేసిన ప్రయత్నం ఇది’ అని వీడియోతో పాటు పోస్టు చేశాడు.


https://10tv.in/viral-pic-of-baby-removing-doctors-mask-becomes-symbol-of-hope/
దీనికి హృతిక్ రోషన్ రెస్పాండ్ అవుతూ.. ‘డాక్ట‌ర్ అరూప్‌తో చెప్పండి.. ఏదో ఒక రోజు అసోంలో అత‌ని డ్యాన్స్ స్టెప్పుల‌ను నేర్చుకునేందుకు వస్తాను. అత‌నిలా డ్యాన్స్ చేస్తాను. బీభత్సమైన ఉత్సాహం దాగి ఉంది అతనిలో’ అంటూ హృతిక్ రోష‌న్ క్యాప్ష‌న్ ఇచ్చాడు.