Polling Booth: పోలింగ్ బూత్‌లో ఉన్న ఓటర్లు 90.. పోలైంది 171

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. 90 ఓట్లున్న పోలింగ్ బూత్ లో 171 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కొండ జిల్లా హఫ్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్రాంగ్సో సమీపంలో గల 107 (ఎ) నంబర్ ఖోత్లిర్ లోయర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ సెంటర్ లో జరిగింది. రెండవ విడత పోలింగ్ లో భాగంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

Polling Booth: పోలింగ్ బూత్‌లో ఉన్న ఓటర్లు 90.. పోలైంది 171

Assam Elections

Polling Booth: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. 90 ఓట్లున్న పోలింగ్ బూత్ లో 171 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కొండ జిల్లా హఫ్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్రాంగ్సో సమీపంలో గల 107 (ఎ) నంబర్ ఖోత్లిర్ లోయర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ సెంటర్ లో జరిగింది. రెండవ విడత పోలింగ్ లో భాగంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

ఏప్రిల్ 1 న ఎన్నిక జరగ్గా ఏప్రిల్ 2 న పోలింగ్ బూత్ లో ఎక్కువ ఓట్లు పడినట్లు గుర్తించారు. జిల్లా ఎన్నికల పర్యవేక్షణాధికారి పాల్ బారువా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పాల్.

విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించినందుకు గాను సీఖోసిమ్ లాంగం (సెక్టార్ ఆఫీసర్), ప్రహ్లాద్ చి రాయ్ (ప్రిసైడింగ్ ఆఫీసర్), పరమేశ్వర్ చారంగ్సా (1 వ పోలింగ్ అధికారి), స్వరాజ్ కాంతి దాస్ (2 వ పోలింగ్ అధికారి) మరియు లాల్జామ్లో థీక్ (3 వ పోలింగ్ అధికారి) సస్పెండ్ చేశారు.

మువాల్‌డామ్ లోయర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌కు చెందిన ఓటర్లలో కొందరు ఖోత్లిర్ లోయర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారని, పోలింగ్ అధికారుల “బాధ్యత లేకపోవడం” వల్లనే ఇది జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు అసలు విషయం గుర్తించారు

ఆ గ్రామ పెద్ద ఎన్నికల అధికారుల వద్ద ఉన్న ఓటర్ లిస్టును తప్పుబట్టారు. ఇది సరైనది కాదని తన వద్ద ఉన్న ఓటర్ లిస్టును ఎన్నికల అధికారులకు అందించారు. దింతో వారు గ్రామా పెద్ద ఇచ్చిన 171 మంది ఓటర్లు ఉన్న లిస్ట్ ఆధారంగా పోలింగ్ నిర్వహించారు. అయితే ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. అధికారుల వద్ద ఉన్న ఓటర్ లిస్టునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే లిస్టును అధికారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఇక్కడ అధికారులు ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన లిస్ట్ తో పోలింగ్ జరపడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఈ తప్పిదం అధికారుల సస్పెండ్ కు దారి తీసింది. అయితే గత ఎన్నికల నాటి పోలింగ్ లిస్టును ఆ గ్రామ పెద్ద ఎన్నికల అధికారులకు అందించినట్లుగా తెలుస్తుంది. దీని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు.