Gauhati HC :అత్యాచార బాధితురాలు,నిందితుడు ఇద్దరూ ‘భవిష్యత్ సంపద’: జడ్జి వ్యాఖ్యలు

విద్యార్థిని అత్యాచారం కేసులో బాధితురాలు, నిందుతుడు ఇద్దరూ 'దేశ భవిష్యత్ సంపద‘ అంటూ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Gauhati HC :అత్యాచార బాధితురాలు,నిందితుడు ఇద్దరూ ‘భవిష్యత్ సంపద’: జడ్జి వ్యాఖ్యలు

Iit Student Rape Case

Future Asset Gauhati HC : కొన్ని కేసుల్లో న్యాయమూర్తులు సంచనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అత్యాచారం కేసులు, లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో ఓ అత్యాచారం కేసుకు సంబంధించి బెయిల్ విచారణ సందర్భంగా..గౌహతి హైకోర్టు న్యాయమూర్తి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఓ వ్యక్తి తనకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడని యువతి కేసులు విచారణలో జస్టిస్ అజిత్ బోర్తాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

గవాహటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్ధిని అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని, అత్యాచార బాధితురాలిని ప్రతిభావంతులుగా..‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించారు గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్. 2021 మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించి, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారం చేశాడని ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో సదరు నిందితుడు బెయిలు కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అజిత్ బోర్తాకూర్ మాట్లాడుతు.. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన బాధితురాలు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని..వారు ప్రతిభావంతులనీ, ‘దేశ భవిష్యత్ సంపద’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆగస్టు 13న నిందితుడికి బెయిలు మంజూరు చేశారు సదరు న్యాయమూర్తి.

ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని కోర్టు భావిస్తు..చార్జ్ షీట్‌లో పేర్కొన్న సాక్షుల లిస్టును కూడా పరిశీలించిన క్రమంలో నిందితులు వారి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని..సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం లేదని భావించిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్లుగా పేర్కొంది. అందువల్ల సాధారణ బెయిల్ షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసు పూర్తిగా పరిష్కరం అయ్యేంత వరకు కోర్టు నిర్ణయించిన అన్ని తేదీలలో విచారణ కోర్టుకు నిందితుడు హాజరుకాలని ఆదేశించింది.