Night Curfew : కరోనా కేసులు పెరగటంతో నైట్‌ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

మరోసారి కరోనా కేసులు పెరగటంతో అస్సాం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించింది.

Night Curfew : కరోనా కేసులు పెరగటంతో నైట్‌ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Assam Govt Announces Night Curfew

Assam govt Announces Night Curfew : కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ మొదలైపోయిందా? అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈక్రమంలో అస్సోంలో మరోసారి కరోనా కేసులు పెరిగి ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసులను నియంత్రించే దిశగా చర్యలు ప్రారంభించింది.దీంట్లో భాగంగానే బుధవారం (సెప్టెంబర్ 1) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నైట్‌కర్ఫ్యూ విధించింది. అన్ని జిల్లాల్లోను ఈ నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులకు ఆదేశించింది. ఈరోజు రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

గత 7 నుంచి 10 రోజుల్లో కరోనా కేసులు గతంకంటే ఎక్కువగా నమోదుకావటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, షోరూంలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని సర్కారు ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగుతాయని చెప్పింది.

ప్రయాణికులు వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, హయ్యర్‌ సెకండరీ, నర్సింగ్‌ కోర్సులు, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో ఫిజికల్‌ క్లాస్‌లకు హాజరయ్యేందుకు సింగిల్‌ డోసు టీకా వేసుకున్న విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

దీని కోసం విద్యార్థులు, టీచింగ్ రంగంలో ఉన్నవారు, సిబ్బందికి మూడు రోజుల ముందుగానే వ్యాక్సిన్‌ వేయనున్నట్లు చెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సినిమా థియేటర్లు మూసిసే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఆఫీసులు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు రాత్రి 8 గంటలకు మించి తెరిచి ఉంచరాదని స్పష్టంచేసింది. అలాగే రెస్టారెంట్లు, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు వంటి తినుబండారాల వ్యాపారాలు కూడా రాత్రి 8 గంటలకు మూసివేయాలని కోరారు. ఆయా వ్యాపార ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా గుమిగూడ కుండా ఉండే చూసుకునే బాధ్యత వారిదేనని నిబంధనలుఅతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. అలాగే కోవిడ్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. కాగా..మంగళవారం అసోంలో 570 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించగా.. ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,426కు పెరిగింది.