Assam govt : మద్యానికి బానిసలైన పోలీసులకు బలవంతపు వీఆర్ఎస్ .. కానిస్టేబుల్స్ నుంచి అధికారుల వరకు ఉద్యోగాలు ఊస్టింగ్

మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అస్సాం సీఎం. మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటు షాక్ ఇచ్చింది అస్సాం సర్కార్.

Assam govt : మద్యానికి బానిసలైన పోలీసులకు బలవంతపు వీఆర్ఎస్ .. కానిస్టేబుల్స్ నుంచి అధికారుల వరకు ఉద్యోగాలు ఊస్టింగ్

Assam CM Himanta

Assam govt : అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యానికి బానిసలైన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్స్ నుంచి ఉన్నతస్థాయిలో పనిచేసే అధికారుల వరకు ఎవ్వరిని ఉపేక్షించేదిలేదంటూ మద్యం సేవించే 300లమందిని ఉద్యోగం నుంచి తొలగించే నిర్ణయం తీసుకుంది. ఆ 300లమందిని వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ)ద్వారా తొలగించింది. అంతేకాదు మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎవరైనా ఇటువంటి వ్యవసనపరులుఉంటే వారికి కూడా వారికి కూడా వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. దీంతో మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇలా మద్యం సేవించటం అలవాటుగా ఉండి వీఆర్ఎస్ అందుకున్న వారిలో కానిస్టేబుల్స్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని వారు మద్యానికి బానిసలుగా మారి వారి ఆరోగ్యాలను కూడా పాడుచేసుకున్నారని అటువంటివారు పోలీసులు సేవల్లో ఉండటం సరికాదన్నారు సీఎం. వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆదివారం (ఏప్రిల్30,2023) తెలిపారు.

గ్రేడ్ 3,గ్రేడ్ 4 పోస్టుల ఫలితాలను వరుసగా మే3,4 తేదీల్లో ప్రకటిస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. వారికి మే11న అపాయింట్ మెంట్ లెటర్స్ అందుతాయని దాదాపు 50,000మంది ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేసే కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొంటారని సీఎం తెలిపారు.కాగా..అస్సాంలో హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా సీఎం హిమంత బిశ్వ శర్మే పర్యవేక్షిస్తున్నారు.