Assam-Mizoram Border Dispute : అసోం, మిజోరం బోర్డర్‌లో టెన్షన్.. 6 పోలీసులు మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో వివాదాస్పద అసోం-మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అసోంలో కాచర్, మిజోరం కొలాసిబ్ జిల్లా సరిహద్దులో స్థానికులకు భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులకు దారితీసింది.

10TV Telugu News

Assam-Mizoram Border Dispute : ఈశాన్య రాష్ట్రాల్లో వివాదాస్పద అసోం-మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అసోంలో కాచర్, మిజోరం కొలాసిబ్ జిల్లా సరిహద్దులో స్థానికులకు భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిల్చార్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో మరో 50 మందికి చికిత్స అందిస్తున్నారు. మిజోరాం వైపు నుంచి జరిపిన కాల్పుల్లో కాచర్ జిల్లా ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్‌కు సైతం గాయాలయ్యాయి. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో  సరిహద్దు ప్రాంతాలకు 2 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.  ఈ హింసాత్మక ఘటనలో ఇరువైపులా రాళ్లు రువ్వుకున్నారు. ప్రభుత్వాధికారులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు.

శాంతిభద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.  ఈ ఘటన నేపథ్యంలో అసోం, మిజోరం సీఎంల మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. అసోం మీదుగా మిజోరం వచ్చేవారిపై అక్కడి స్థానికుల దాడులు చేస్తున్నారంటూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగ ట్వీట్ చేశారు. మిజోరం సీఎం ట్వీట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని దాడులు జరగడకుండా అమిత్ షాను కోరారు. ఈ ట్వీట్ కు అసోం హిమంత్ బిశ్వ శర్మ సమాధానమిచ్చారు.


ప్రజలను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని ఎలా నడపగలమని ప్రశ్నించారు. వరుస ట్వీట్లతో ఇరువురు విమర్శల అస్త్రాలు సంధించుకున్నారు. ఈ అంశంపై జోక్యం చేసుకున్న అమిత్ షా ఇద్దరు ముఖ్యమంత్రులతో  ఫోన్ లో మాట్లాడారు. బోర్డర్‌లో పరిస్థితులను చక్కదిద్దాలని సీఎంలకు సూచించారు. కొలాసిబ్-కాచర్ జిల్లాల సరిహద్దుల్లో హింస సర్దుమనిగినా అక్కడి పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.

10TV Telugu News