అసోంలో పౌరుల తుది జాబితా : NRCలో పేరు లేకుంటే ఏమవుతుంది

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 07:51 AM IST
అసోంలో పౌరుల తుది జాబితా : NRCలో పేరు లేకుంటే ఏమవుతుంది

అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (NRC) పౌరుల తుది జాబితా విడుదల రిలీజ్ చేసింది. ఇందులో 19 లక్షల 06 వేల 657 మందికి చోటు దక్కలేదు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో 3 కోట్ల 11 లక్షల 21 వేల 004 మందికి చోటు లభించింది. జాబితా విడుదల చేసే సమయంలో అక్కడి ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గుహవటి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. 

అయితే..జాబితాలో లేని వారిలో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవోనని చూసేందుకు టెన్షన్ పడ్డారు. అష్టకష్టాలు పడ్డారు. NRCASSAM వెబ్ సైట్‌కు జనాలు ఎగబడ్డారు. దీంతో సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. తమ పేరు లేదు..ఏమవుతుంది ? తమను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మంటారా ? అనే ఆందోళన వారిలో నెలకొంది. 

వెంటనే విదేశీయులుగా ప్రకటించకుండా..న్యాయం పోరాటం చేసేందుకు కేంద్రం అవకాశం ఇస్తుందని తెలుస్తోంది. ఫారిన్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇందుకు 120 రోజుల గడువు విధించినట్లు సమాచారం. అసోం వ్యాప్తంగా వేయి ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వంద ట్రిబ్యునల్ పనిచేస్తుండగా..మరో 200 ట్రిబ్యునల్స్ త్వరలో ఏర్పాటు చేయనుంది కేంద్రం. NRCలో చోటు దక్కని వారిని అరెస్టు చేయరని, వాళ్లు విదేశీయులని ట్రిబ్యునల్ నిర్దారిస్తే అరెస్టు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ట్రిబ్యునల్స్‌లో కేసు ఓడిపోతే..హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ జాబితాలో లేనిపేర్లను ఆన్‌లైన్లను ఉంచారు. 

జాబితాలో లేకపోయినా..ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని కేంద్రం ప్రకటించింది. ఎవరినీ నిర్బందించబోమంటూ హామీనిచ్చింది కేంద్రం. సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాల నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని..పిల్లలకు, విద్య, పౌరసత్వం తదితర అంశాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని ప్రకటించింది. జాబితాలో లేని వారు ట్రైబ్యునల్ తర్వాత..హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని..న్యాయం పొందడానికి అవసరమయ్యే వ్యయం భరిస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.