Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. ఈ హైడ్రామాలో శివసేన నేత సంజయ్ బోస్లేని పోలీసులు అరెస్ట్ చేశారు.

Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..

Shiv Sena Leader Sanjay Bhosale Arrest

Maharashtra political crisis.. : మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. సీఎంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి 42మంది ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో కాపుకాశారు ఏక్ నాథ్ షిండే. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం అంటూ సవాలు విసురుతున్నారు. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఉద్ధవ్ ఓ పక్క షిండే వర్గాన్ని బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం సమేమిరా అంటున్నారు.

ఈక్రమంలో..అస్సాంలోని గౌహాతిలో ఉన్న శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలను కలుసుకుని వారిని బుజ్జగించి తిరిగి రప్పించేందుకు శివసేన ఎమ్మెల్యే సంజయ్ భోస్లేను పంపించారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన శివసేన నేత సంజయ్ భోస్తేను పోలీసులు అరెస్ట్ చేశారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన రాడిసన్ బ్లూ హోటల్ లోకి వెళ్లకుండా సంజయ్ భోస్లేను పోలీసులు అరెస్ట్ చేశారు. శివసేన ఎమ్మెల్యేలకు ఎంతో చేసిందని సంజయ్ బోస్లే చెబుతున్నారు. మాతోశ్రీకి ఎమ్మెల్యేలు ఏదైనా సేవ చేయాలని కూడా ఆయన కోరారు.

Also read : Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ ప్రాంతం సున్నితమైన ప్రాంతమని పోలీసులు సంజయ్ బోస్లేకు చెప్పారు. అనంతరం బోస్లేను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొంటామని పోలీసులు చెబుతున్నారు.కాగా..మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని..తమదే అసలైన శివసేన అంటూ శుక్రవారం ప్రకటించారు ఏక్ నాథ్ షిండే. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని..వారికి తాము ఎటువంటి ఆశలు కల్పించలేదని షిండే చెబుతున్నారు. మెజారిటీ సంఖ్యలు మా వద్ద ఉన్నాయి.. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు మరియు 12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని ధీమాగా చెబుతున్నారు షిండే.

Also read : Maharashtra: శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజ‌య్ రౌత్

ఈ క్రమంలోనే షిండే కొత్త పార్టీ గురించి క్లారిటీ ఇచ్చారు. తామే అసలైన శివసేన నేతలం అని చెబుతున్న షిండే..తాము పార్టీ మారబోమని స్ప‌ష్టం చేశారు. తామే బాలాసాహెబ్ ఠాక్రే అస‌లైన శివ సైనికుల‌మ‌ని..ప్ర‌భుత్వ ఏర్పాటుపై త‌మ‌తో క‌లిసి వున్న‌వారిపై త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.