అస్సోం : కలెక్టర్ అయిన మహిళా జర్నలిస్టు : పిల్లలతో కలిసి ఓటు హక్కుపై వినూత్న అవగాహన

అస్సోం : కలెక్టర్ అయిన మహిళా జర్నలిస్టు : పిల్లలతో కలిసి ఓటు హక్కుపై వినూత్న అవగాహన

Jorhat Collector Roshni Aparanji Korati Appealed Voters With Her Kids

jorhat collector roshni aparanji voters with her kids : అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అదే ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఆంధ్రా అమ్మాయి రోహిణీ అపరంజి. జర్నలిస్టు అవ్వాలనే కోరికతో దాన్ని నెరవేర్చుకున్నారు. కానీ లక్ష్యం చేరుకుంటే ఇక ఆపై పయనం ఆగిపోతుందనే ఓ మహానుభావుడు చెప్పినట్లుగా రోహిణి లక్ష్యం అక్కడితో ఆగిపోలేదు. మరో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అదే కలెక్టర్ కావాలని. అనుకున్నట్లే కలెక్టర్ కూడా అయిపోయిందీ ఆంధ్రా అమ్మాయి రోహిణీ అపరంజి. ప్రస్తుతం అస్సోంలో కలెక్టర్ గా పనిచేస్తున్నారు విశాఖపట్నం అమ్మాయి. అసోం ఎన్నికల్లో ఓటు హక్కుపై పిల్లలతో కలిసి అవగాహన కల్పిస్తోంది రోహిణీ అపరంజి.

విశాఖపట్నం అమ్మాయేజోర్హాట్ జిల్లా కలెక్టర్ రోషిణి అపరంజి ప్రజలకి సేవచేయాలనే లక్ష్యంతో జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు. వెంటనే ఆంధ్రా యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్టులో రెండో ర్యాంక్ తెచ్చుకుని అనుకున్న లక్ష్యం సాధించారు. జర్నలిస్టు అయ్యారు. అయినా సరే ఆమె లక్ష్యం అక్కడితో ఆగలేదు. నేరుగా ప్రజలకు సేవ చేయాలి అంటే కలెక్టర్ అవ్వడమే సరైంది అనుకున్నారు. అంతే అనుకున్నది చేసేయటం..చేసేదాన్ని సాధించటం అలవాటు అయిన రోహిణి ఏ మాత్రం లేట్ చేయకుండా సివిల్స్ పై ఫోకస్.. చేసి కలెక్టర్ అయిపోయారు. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వహిస్తున్నారు రోహిణీ అపరంజి.

అసోంలోని జోర్హాట్ జిల్లా కలెక్టర్ ఉన్న రోషిణి మన తెలుగు అమ్మాయే అని చాలమందికి తెలియదు. జిల్లా కలెక్టర్ గా నిజాయితీగా పనిచేస్తు అసోంలో మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు రోహిణీ అపరంజి. డ్యూటీ అంటే డ్యూటీయే. మరో మాటేలేదు. డ్యూటీలో దేన్నీ లెక్కచేయని స్టైల్ ఆమె సొంతం. ప్రజలకు ఎప్పుడూ చేరువగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందకు రావటం ఆమె డ్యూటీకి ఇచ్చే గౌరవం. ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తారని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం అస్సోంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రోహిణీ అపరంజి మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు..పశ్చిమ బెంగాల్ తో పాటు అసోంలో కూడా తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు అవగాహన కల్పించడానికి వినూత్న ప్రయత్నం చేపట్టారు. తన ఇద్దరి బిడ్డలతో కలిసి.. ఓటు వేయండి అనే ఫ్లెక్సీలు పట్టుకుని ఓటర్లకు అవగామన కల్పిస్తున్నారు. కలెక్టర్ రోహిణీ ‘‘I am proud A voter’ అని ఫ్లెక్సీ పట్టుకుని నినదిస్తుంటూ..ఆమె ఇద్దరు బిడ్డలు ‘‘my mother is a proud voter’’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిడ్డలతో కలిసి ఆమె ఇలా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది.పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో కలెక్టర్ రోహిణీ చూపించిన తెగువ అస్సోం ప్రజలను, అధికారులను, ప్రజా ప్రతినిధులను కూడా ఆశ్చర్య పరిచేలా చేసింది. లాక్ డౌన్ సమయంలో క్షణం కూడా తీరికి లేకుండా పని చేశారు. 24 గంటూ గడియారంలా పనిచేశారు. కాలానికైనా అలుపు ఉంటుందేమోగానీ ఆమెకు మాత్రం అలసట రాదా? అనుకునేవారు అధికారులు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. కఠిన నిబంధనలు అమలు అయ్యేలా చూసేవారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేయడం సక్సెస్ అయ్యారు. విసుగు, విశ్రాంతి, విరామం అనేది లేకుండా జిల్లా అంతా తిరిగేవారు. ప్రజల బాగోగుల్ని కనుక్కునేవారు. ఆమెకు డ్యూటీయే ప్రాణం. కరోనా కాలంలో తన ఇద్దరు చిన్నబిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా లేకుండా నిత్యం ప్రజల గురించే తపన పడేవారు. ఆమె డ్యూటీ ఎంత కఠినతరంగా ఉంటుందంటే..ఇద్దరు చిన్న బిడ్డలను కనీసం ఎత్తుకునే పరిస్థితి కూడా లేకుండా పని చేశారు.

కలెక్టర్ రోషిణికి ఇద్దరు కొడుకులు. పెద్ద అబ్బాయికి ఐదేళ్లు, చిన్నోబాబుకి కేవలం రెండున్నర ఏళ్లు.అటు ఉద్యోగ బాధ్యతలు..ప్రజల బాగోగులు, మరో వైపు కుటుంబం. అంతేకాదు తన ఇద్దరు చిన్నపిల్లలతో పాటు 65 ఏళ్లు పైబడిన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. తల్లిదండ్రులు ఆమెతోపాటే ఉంటారు. అయితే వీరందరి కోసం ఓ అమ్మాయిలా కాకుండా.. ఇంట్లోనూ కలెక్టరమ్మలా ఆదేశాలు జారీ చేసి ఆశ్చర్యపరిచేవారు.

పిల్లలు, పెద్దలు ఇంట్లో కిందివాటాలో ఉంటే.. ఆమె ఒక్కతే పైఅంతస్తులో ఉండేవారు. చిన్నపిల్లాడు అమ్మ కోసం ఏడ్చినా… ఆ ఏడుపు తన చెవిన పడినా.. గుండెను రాయి చేసుకొని.. మెట్టు దిగి రావడకుండా.. కరోనా నియంత్రణపైనే ఫోకస్ పెట్టేవారు. దీనికి కారణం కరోనా సమయంలో విరామం లేకుండా నిరంతరం ప్రజల్లో తిరగటం వల్లనే. బిడ్డలను ఎత్తుకోవాలని ఓ తల్లిగా గుండె తపించిపోయినా గుండె రాయి చేసుకునేవారు. అమ్మ కోసం బాబు ఏడుస్తుంటే గదిలో గోడ చాటునే ఉండి బిడ్డను కనీసం ఎత్తుకోలేని పరిస్థితులు ఆమెవి. ‘‘బాబు ఏడుస్తున్నాడమ్మ అని చెప్పినా.. కరోనా టైంలో ఫస్ట్ డ్యూటీ అంటూ.. ఆమె డ్యూటీకే పరిమితమయ్యేవారు.

జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగకుండా ఆమె చేసిన ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఎన్నెన్నో ప్రశంసలు అందుకున్నారు. కరోనా అనుమానితులను పర్యవేక్షించడానికి.. జిల్లాలో పరిస్థితి సమీక్షించడానికి ఆమె ఐసోలేషన్‌ సెంటర్లు,క్వారంటైన్‌ సెంటర్‌కి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో మరింత బాధ్యతగా ఉండాలనే కారణంతో చిన్న పిల్లలు, వయసు పైబడిన పెద్దలను దూరంగానే ఉండేవారు. దాదాపు నాలుగు నెలలు తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చాకే బిడ్డను దగ్గరకి తీసుకుని..గుండెలకు అదుముకున్నారు. వెల్లువలా పొంగుకొచ్చిన అమ్మతనంతో అమ్మ మనసు చాటుకున్నారు. ఇలా ఆమె కలెక్టరమ్మగా అటు జిల్లా ప్రజల బాగోగులు..చూస్తూ జిల్లాపై తనదైన ముద్ర వేశారు.

జోర్హాట్ లో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రోహిణీ అపరంజి విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో జర్నలిజం రెండేళ్ల కోర్స్ పూర్తి చేశారు. ఆ టెస్టులో ఏపీ వ్యాప్తంగా రెండో ర్యాంక్ తెచ్చుకున్నారు. ఓ వైపు జర్నలిజం చేస్తూనే.. ఇంటర్నిషిప్ లో భాగంగా స్థానిక ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టుగా కూడా సేవలు అందించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే జర్నలిస్టుగా మారాను అని ఆమె తరచూ చెప్పేవారు. అలా ఓ వైపు జర్నలిజం చదువుతూన్న సమయంలోనే మరోవైపు ఐ.ఎ.ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2005 -2007లో జర్నలిజం పూర్తి చేసారు రోహిణి.

తరువాత హైదరాబాద్ వెళ్లి ఐ.ఎ.ఎస్ పరీక్షల కోసం స్పెషల్ కోచింగ్ తీసుకుని పట్టుదలతో పరీక్ష రాసి నేరుగా ఐ.ఎ.ఎస్ కు సెలెక్ట్ అయ్యి సత్తా చాటారు. కలెక్టర్ అయిన తరువాత కూడా ఆమెలో అదే పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ప్రజల కోసం కష్టపడి పనిచేయటంలో ఆమె పట్టుదల కనిపిస్తోంది. అదే లక్ష్యంతో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానంటున్నారు మన ఆంధ్రా అమ్మాయి అస్సోం రాష్ట్రంలో కలెక్టర్ గా పనిచేస్తున్న రోహిణీ అపరంజి.