Assam: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్.. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్న సీఎం

అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్‌ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.

Assam: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్.. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్న సీఎం

Assam: ర్యాగింగ్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా అంతం కావడం లేదు. తాజాగా అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన డిబ్రూగఢ్ యూనివర్సిటీ పరిధిలో ఆదివారం జరిగింది.

Female Cheetahs: అరణ్యంలోకి ప్రవేశించిన మరో రెండు చీతాలు.. క్వారంటైన్ పూర్తి కావడంతో విడిచిపెట్టిన అధికారులు

ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా స్పందించారు. యూనివర్సిటీలో ఆనంద్ శర్మ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఐదుగురు విద్యార్థులు కలిసి హాస్టల్ డార్మిటరీలో ఆనంద్ శర్మపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఇది భరించలేని ఆనంద్ శర్మ హాస్టల్, రెండో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు ఆనంద్ శర్మను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడు నిరంజన్ ఠాకూర్‪ను అరెస్టు చేశారు.

PT Usha: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష.. ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా రికార్డు

మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిచారు. ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకోవాలని, బాధిత విద్యార్థికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులంతా ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.