మంచినీళ్ల పైపుకు నమస్కారం చేసి.. ప్రార్థనలు చేసిన మహిళ..వైరల్ వీడియో

మంచినీళ్ల పైపుకు నమస్కారం చేసి.. ప్రార్థనలు చేసిన మహిళ..వైరల్ వీడియో

Assam women happy with water pipeline in home : జలమే జీవనాధారం. నీరు లేనిదే ప్రాణి లేదు. సమస్త కోటికి జీవనాధారం నీరే. ఆ నీటిని ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. ఉదయం లేచింది మొదలు మనంపడుకోబోయే వరకూ నీరు లేనిదే మనకు ఒక్కపనికూడా జరగదు. తినటానికి తిండే దొరకదు. అటువంటి నీటిని గౌరవించాలి. అదే చేసిందో మహిళ. తన ఇంటికి వచ్చిన ‘మంచినీటికి నమస్కారం’ చేసింది. నీటి పైపుకు నమస్కరించిన ఆ మహిళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వేసివికాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో నీటి కరువు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లాల్సిన దుస్థితి. మంచి నీటి కోసం ఎన్నో కష్టాలు పడిన తమ ఇంటికి ‘నీళ్ల పైపు’ రావడంతో ఓ మహిళ పట్టరాని సంతోషంతో పైపులైన్​న​కు మొక్కింది. ఆమె సంతోషం చూసి నెటిజన్ల మనసు కరిగిపోతోంది. నీటిని ఇంత గౌరవిస్తున్న ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసోంకి చెందిన 60ఏండ్ల మహిళ ఇంటికి కొత్తగా నీటి కుళాయి కనెక్షన్ మంజూరు అయింది. తమ ఇంటి దగ్గర వేసి పైపులైన్​కు నీళ్లు రావడంతో ఆమె సంతోషపడిపోయింది. ఎంతో దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే ఆమె తొలిసారి ఇంట్లోనే నీరు రావడం చూసిన ఆమె పైప్​లైన్​కు దండం పెట్టారు. ప్రార్థన చేశారు. నీటిని గౌరవిస్తు ఆమె చేసిన నమస్కారం నెటిజన్లను ఆకట్టుకుంది.

పైపు లైనుకు నమస్కారం చేస్తున్న మహిళ వీడియోను కేంద్ర జల్​ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “తన ఇంట్లో టాప్ వాటర్​ను ఈ సోదరి ఆహ్వానిస్తున్నారు. శిరస్సు వంచి ప్రార్థిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మంచినీటి పథకం వారి జీవితాలను ఎలా మార్చిందో అర్థమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా నీళ్లకు ఇబ్బంది పడిన వీరి కష్టాలు ఇప్పటికి తీరాయి” అని మంత్రి గజేంద్ర సింగ్ పేర్కొన్నారు.