Assam Bihu Dance Guinness Records : అస్సాం సంప్రదాయ నృత్యం బిహూ గిన్నీస్‌ రికార్డ్ ‌..

11,304 మంది కళాకారులు ఒకేవేదికపై ప్రదర్శించిన అస్సాం జానపద బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదే వేదికపై మరో రికార్డు కూడా నెలకొల్పి సరికొత్త రికార్డుకు వేదికైంది అస్సాం.

Assam Bihu Dance Guinness Records : అస్సాం సంప్రదాయ నృత్యం బిహూ గిన్నీస్‌ రికార్డ్ ‌..

Assam Bihu Dance..Guinness Records

Assam Bihu Dance..Guinness Records : బిహూ నృత్యం (Bihu Dance). అస్సాం (Assam) రాష్ట్ర జానపద నృత్యం (Traditional Dance). ఈ బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness Book Of World Records) సాధించింది. అస్సాంలో ఒకే వేదికపై అస్సాం సంప్రదాయ నృత్యం అయిన బిహూను 11,304 మంది కళాకారులు ప్రదర్శించారు. ఒకేవేదికపై బిహూను లయబద్దంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డు సాధించింది. అస్సాం సంప్రదాయ నృత్యమైన (Traditional Dance) బిహూ డ్యాన్స్‌ (Bihu Dance) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో (Guinness Book Of World Records) స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ నృత్యం గిన్నిస్ రికార్డు సాధించింది.

గువాహటిలోని (Guwahati) సరుసజై స్టేడియంలో (Sarusajai Stadium) జరిగి ఈ కార్యక్రమంలో సంప్రాదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాస్టర్‌ ట్రైనర్లు, డ్యాన్సర్లతోసహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి రూ.25 వేలు ప్రభుత్వం గ్రాంట్‌గా ఇవ్వనుంది.

దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతు..ఒకే వేదికపై అతిపెద్ద బిహు నృత్య ప్రదర్శనను నిర్వహించడం, జానపద-నృత్యం విభాగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేరడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. ఇదే వేదికపై డ్రమ్మర్స్ కూడా మరో రికార్డును క్రియేట్ చేశారు. బిహు నృత్యం కార్యక్రమం తరువాత అదే స్టేడియంలో 2548 మంది డ్రమ్స్‌ వాయించి ఒకే చోట ఇంతపెద్ద సంఖ్యలో డమ్మర్లు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఇలా ఒకేవేదికపై రెండు కార్యక్రమాలు గిన్నిస్ రికార్డు సాధించటం అదికూడా ఒకే రోజున సాధించటంకూడా ఓరికార్డు అనుకోవచ్చు.

ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రానికి చెందిన జానపద నృత్య బిహూ. ఈ నృత్యం ప్రదర్శనలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.

బొహాగ్ బిహు (వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి వక్క, తమలపాకు, డబ్బులు ఉంటాయి.