Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

జనవరి 8న, దేశంలోని 5 రాష్ట్రాలు - ఉత్తరప్రదేశ్ (UP), ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా (GOA), మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.

Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

Elections

Assembly Election 2022: జనవరి 8న, దేశంలోని 5 రాష్ట్రాలు – ఉత్తరప్రదేశ్ (UP), ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా (GOA), మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం. వీటిలో ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌లలో ఇప్పటికే ఓటింగ్ పూర్తవగా.. ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే దశలో ఓటింగ్ ముగిసింది. మణిపూర్‌లో మొదటి దశలో ఫిబ్రవరి 27న ఓటింగ్ నిర్వహించగా.. రెండో దశ మార్చి 3న ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే, ఎన్నికల సంఘం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటిలో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 తేదీల్లో 5 దశల్లో ఓటింగ్ జరగ్గా.. మార్చి 3న ఆరో దశ ఓటింగ్‌ జరగబోతుంది. ఇది కాకుండా మార్చి 7వ తేదీన చివరి దశలో ప్రజలు తమ ఓటును వినియోగించుకోనున్నారు. దీంతో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియబోతున్నాయి. దీని తర్వాత మార్చి 10న ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

అదే సమయంలో ఇదే ఏడాది అంటే 2022లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలు అందుకోసం సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా జమ్మూకశ్మీర్‌లో కూడా ఎన్నికలు జరిగితే మొత్తం 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినట్లుగా అవుతాయి.

ఇది మాత్రమే కాదు, ఎన్నికల ప్రకారం 2023 కూడా ఎన్నికలకు పెద్ద సంవత్సరం కానుంది. 2023లో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం ఉన్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. అంతకుముందే దాదాపు అన్నీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందస్తుకు వెళ్తే 2024కి ముందే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది.