Assembly Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..ఫలితాలపై ఉత్కంఠ, ఈసీఐ వెబ్ సైట్ లో రిజల్ట్స్..ఎలా చూడాలి

Assembly Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..ఫలితాలపై ఉత్కంఠ, ఈసీఐ వెబ్ సైట్ లో రిజల్ట్స్..ఎలా చూడాలి

Election

ECI Website : బెంగాల్ కోట మమతదా ? మోదీదా ? తమిళనాట స్టాలిన్ కల నెరువుతుందా ? కేరళ జనం లెఫ్ట్ కే..రైట్ కొడుతారా ? అసోంలో అధికారం అందుకొనేది ఎవరు ? పుదుచ్చేరి కమలానికి కలిసి వస్తుందా ? తిరుపతి, సాగర్ బై పోల్స్ లో బ్యాండ్ మోగించేది ఎవరు ? వ్యాక్సిన్ ఇచ్చిందెవరకు ? ఐసీయూలోకి పంపేదెవరిని ? ప్రస్తుతం అందరి చూపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉంది.

ప్రధానంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై ఉంది. ఇక్కడ దీదీకి కమలనాథులు చెక్ పెడుతారా ? అనే ఉత్కంఠ నెలకొంది. పలు దఫాలుగా జరిగిన ఎన్నికల పోలింగ్… కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2021, మే 02వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది.

వెబ్ సైట్ లో ఫలితాలు తెలుసుకొనవచ్చు. ఇందుకు యూజర్లు లాగిన్ కావాల్సి ఉంటుంది. మల్టీ-డైమన్షనల్ అనాలసిస్ కూడా ఉంటుంది. ఈసీఈ అధికారిక వెబ్‌సైట్ : https://results.eci.gov.in/ ఈ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌ మీద రాష్ట్రం, కేంద్ర పాలిత డిస్ ప్లే అవుతుంది.

ఈసీ యాప్‌లో ఫలితాలను చెక్ చేసుకునేందుకు…గూగుల్ ప్లే స్టోర్‌ను కానీ యాపిల్ యాప్ స్టోర్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వాటిని సమర్పించాలి. తర్వాత హోం పేజీలోని రిజల్ట్ ఆప్షన్‌ను ఉపయోగించుకుని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తెలుసుకోవచ్చు.

Read More : Covid-19 Vaccine : రోడ్డు పక్కన ట్రక్కు..తెరిచి చూస్తే.. 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు