Assembly polls: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయని ఈసీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవాళే షెడ్యూల్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు డిసెంబరు 8న విడుదల కానున్నాయి.

Assembly polls: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయని ఈసీ

Assembly polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవాళే షెడ్యూల్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది.

హిమాచల్ ప్రదేశ్ లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు డిసెంబరు 8న విడుదల కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ దాటాలంటే 35 స్థానాల్లో గెలుపొందాలి. ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వ్యవధి జనవరి 8న ముగియనుంది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కానుంది. అదే రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉంటుంది. ఈ వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీడియా సమావేశంలో తెలిపారు.

ఓటర్లను ఏ రకంగానూ ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా తాము ఈ చర్యలను ఉపేక్షించబోమని చెప్పారు. చట్ట విరుద్ధ చర్యలను కొనసాగనివ్వకుండా నిఘా పెడతామని తెలిపారు. కాగా, గుజరాత్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ కాల వ్యవధి ఫిబ్రవరి 18తో ముగియనుంది.

 10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..