గగన్ యాన్ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ పూర్తి

ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.

గగన్ యాన్ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ పూర్తి

Astronauts For Indias Gaganyaan Mission Complete Training In Russia

Astronauts ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’… గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్లను ఇస్రో తొలిసారి అంతరిక్షంలోకి పంపబోతోంది. గగన్ యాన్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించింది.

గగన్​యాన్​ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన భారతీయ వాయుసేనకు చెందిన నలుగురు పైలట్లు(ఒకరు గ్రూప్ కెప్టెన్, మిగిలిన ముగ్గురు వింగ్ కమాండర్లు)కు శిక్షణ కోసం రష్యాలోని గ్లావ్కోస్మోస్​ సర్వీస్ ప్రొవైడర్​తో 2019 జూన్​లో ఇస్రో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా గగన్​యాన్​ ప్రాజెక్టు కోసం ఎంపికైన నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. జ్వ్యోజ్​డ్నీ గొరోడోక్ నగరంలోని గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్​లో ఈ శిక్షణ పూర్తైంది. 2020 ఫిబ్రవరి 10న శిక్షణ ప్రారంభమవగా.. కరోనా వైరస్ కారణంగా ట్రైనింగ్​కు మధ్యలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. తాజాగా వీరి శిక్షణ పూర్తైంది.

శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగాములతో సాయంత్రం సమావేశమయ్యాం. భవిష్యత్ స్పేస్ ప్రాజెక్టుల విషయంపై భారతీయ రాయబారులతోనూ చర్చించామని రష్యా స్పేస్ ఏజెన్సీ హెడ్ ద్మిత్రి రోగోజిన్ తెలిపారు. ఇక, రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరు మళ్ళీ ఇండియాలో కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇస్రో డిజైన్ చేసిన సర్వీస్ మాడ్యూల్​లో వీరు ట్రైనింగ్ పొందనున్నారు. రూ. పది వేల కోట్ల గగన్ యాన్ ప్రాజెక్టును 2022 లో లాంచ్ చేయనున్నారు.