UP Election : స‌మాజ్‌వాది పెర్ఫ్యూమ్‌ లాంఛ్ చేసిన అఖిలేష్..బీజేపీ పువ్వులో సువాసన లేదని విమర్శలు

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగే ఉత్తరప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంగా పావులు కుదుపుతున్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.

UP Election : స‌మాజ్‌వాది పెర్ఫ్యూమ్‌ లాంఛ్ చేసిన అఖిలేష్..బీజేపీ పువ్వులో సువాసన లేదని విమర్శలు

Up

UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో జరగే ఉత్తరప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంగా పావులు కుదుపుతున్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. యూపీలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్న అఖిలేష్ యాదవ్ తాజాగా ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు సమాజ్ వాదీ సుగంధ్ లేదా అత్త‌ర్ పేరుతో పెర్ఫ్యూమ్‌ను లాంఛ్ చేశారు.

2022లో ఈ సెంట్ మేజిక్ సృష్టిస్తుంద‌ని అసెంబ్లీ ఎన్నిక‌లను ఉద్దేశించి అఖిలేష్ యాద‌వ్ పేర్కొన్నారు. ఇది మంచి పెర్ఫ్యూమ్ అని… దీనిని ఉపయోగించే వారు సమాజ్‌వాదీ పార్టీ, దాని భావజాలం యొక్క సువాసనతను ఇతరులకు గుర్తుచేస్తారన్నారు. ఈ సువాసన ప్రతి ఒక్కరికీ చెందుతుంది, కానీ అబద్ధాల ద్వారా వికసించిన పువ్వు(బీజేపీ గుర్తు) ఎప్పుడూ సువాసనను వెదజల్లదని పరోక్షంగా యోగి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

22 రకాల నేచురల్స్‌తో ఈ సెంట్‌ను తయారు చేశారు. ఆగా, ల‌క్నో, వార‌ణాసి, క‌న్నౌజ్ న‌గ‌రాల పేర్ల‌తో నాలుగు ఫ్రాగ్రెన్సెస్‌తో ఈ ఫెర్ఫ్యూమ్‌ను రూపొందించారు. ఈ సెంట్ బాటిల్స్‌ను ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో రెడీ చేశారు. పెర్ఫ్యూమ్ బాటిల్‌పై అఖిలేష్ యాద‌వ్ ఫోటోతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎన్నిక‌ల గుర్తు “సైకిల్” చిహ్నాన్ని ముద్రించారు. సువాసన పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన కన్నౌజ్ జిల్లాలో పెర్ఫ్యూమ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పుష్పరాజ్ జైన్ దీనిని రూపొందించారు.

ఈ పరిమళాన్ని పరిపూర్ణం చేయడానికి ఇద్దరు శాస్త్రవేత్తలకు దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. సువాసనలో దేశ వైవిధ్యాన్ని సూచించడానికి “కశ్మీర్ నుండి కన్యాకుమారి” వరకు పదార్థాలు ఇందులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్పీ పెర్ఫ్యూమ్ 2022లో విద్వేషాన్ని అంత‌మొందిస్తుందన్నారు.

కాగా, అయితే స‌మాజ్‌వాది పార్టీ సెంట్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే పార్టీకి చెందిన అత్తరును విడుదల చేశారు. 2016లో త‌న ప్ర‌భుత్వం నాలుగేండ్ల పాల‌నకు సంకేతంగా అఖిలేష్ యాద‌వ్ స‌మాజ్‌వాది సుగంధ్ పేరిట ప‌లు పెర్ఫ్యూమ్‌ల‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ALSO READ Terrorists killed In J&K : కశ్మీర్ వ్యాలీకి భారీగా అదనపు భద్రతా బలగాలు..112మంది ఉగ్రవాదులు హతం