Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు

మరో టాప్ బ్రాండ్ ఎథెర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో మంటలు చెలరేగడం వాహనాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎథెర్ ఎనర్జీకి చెందిన చెన్నై షోరూంలో శనివారం మంటలు చెలరేగాయి

Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు

Ather

Ather Electric: దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (EV) ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం పట్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల వరుస పేలుడు ఘటనలు వాహనదారుల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో వినియోగంలో ఉన్న టాప్ బ్రాండ్ విద్యుత్ ద్విచక్ర వాహనాలు మంటల్లో దగ్దమైన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈక్రమంలో మరో టాప్ బ్రాండ్ ఎథెర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో మంటలు చెలరేగడం వాహనాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎథెర్ ఎనర్జీకి చెందిన చెన్నై షోరూంలో శనివారం మంటలు చెలరేగాయి. దీంతో షోరూంలో కొన్ని వాహనాలు, ఇతర సామాగ్రి దగ్ధం అయ్యాయి. మంటలను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీసి..ప్రాణాలు తక్కించుకున్నారు.

other stories: Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు

ఘటనపై ఎథెర్ సంస్థ స్పందిస్తూ..ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ EV, జితేంద్ర EV టెక్ మరియు ఒకినావా సంస్థలకు చెందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలు అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. ఈప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకు సంబందించిన నివేదికను వచ్చే వారం రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు సమర్పించనున్నారు.

other stories: Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్‌లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు

కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ద్విచక్రవాహనాల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే బాధ్యతను డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అప్పగించారు. ఈక్రమంలో వాహనాల్లోని బ్యాటరీ ప్యాక్‌లు మరియు మాడ్యూల్స్ డిజైన్‌లతో సహా బ్యాటరీలలో తీవ్రమైన లోపాలను గుర్తించారు అధికారులు. ఖర్చును తగ్గించుకునేందుకు ఆయా సంస్థలు నాణ్యత తక్కువగల పరికరాలను ఉపయోగించినట్లు డీఆర్డీవో గుర్తించింది.