ఆత్మస్థైర్యం అతని సొంతం : ఒంటి కాలుతో అథ్లెట్ చేసిన ఫీట్ చూడండీ..

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 09:17 AM IST
ఆత్మస్థైర్యం అతని సొంతం : ఒంటి కాలుతో అథ్లెట్ చేసిన ఫీట్ చూడండీ..

రెండు కాళ్లు సక్రమంగా ఉండి..బ్రతికేందుకు ఏమైనా సాధించేందుకు అన్ని అవకాశాలు ఉండి కూడా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకునేవారి గురించి విన్నాం. కానీ ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఒంటికాలితో హై జంప్ చేసిన ఓ అథ్లెట్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అతని పేరు ఫ్రంట్ ఫ్లిప్.ఒక కాలు లేని అథ్లెట్ ఫ్రంట్ ఫ్లిప్ హై జంప్ నెటిజన్లను ఫిదా చేసింది. భారతీయ అటవీ శాఖా అధికారి సుశాంత నందా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఈ 17 సెకన్ల క్లిప్ చూస్తే పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. సంకల్పం ఉంటే వైకల్యం అయినా తలవంచక తప్పదని రుజువు చేసే ఈ వీడియో ప్రతీ ఒక్కరూ చూడాలి. 

“ఎవరైనా ఒకటి వదులుకోవడానికి ఇష్టపడకపోతే ఒక గొప్ప కథ అనేది జరుగుతుంది.”అంటూ ఆయన ఈ వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. “మన మనస్సు మరియు హృదయాన్ని సాధించాలి ఆనుకున దానిపై ఉంచితే మనం సాధించగలిగేది ఆశ్చర్యంగా ఉంటుంది.” అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. స్పూర్తినిచ్చే వీడియో పోస్ట్ చేసిన నందాను పలువురు అభినందిస్తున్నారు.