ఆప్ Vs BJP : గంభీర్ దిగజారుతావా.. దమ్ముంటే నిరూపించండి

ఆప్ Vs BJP : గంభీర్ దిగజారుతావా.. దమ్ముంటే నిరూపించండి

ఆప్ Vs BJP : గంభీర్ దిగజారుతావా.. దమ్ముంటే నిరూపించండి

బీజేపీ తరుపున తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మీద అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలతో పాంప్లీట్లు తయారు చేయించి వాటిని ప్రచారం చేస్తాన్నారంటూ కన్నీరు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. పాంప్లీట్లలో తన గురించి అత్యంత చెత్త వ్యాఖ్యలను గంభీర్ రాయించారని, ఆ వ్యాఖ్యలను చదువుతుంటే ఏడుపు వచ్చిందని చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం గంభీర్ ఇంతలా దిగజారుతారా? అంటూ ఆమె ప్రశ్నించింది.

గౌతం గంభీర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్వాగతించానని, అయితే గంభీర్ ఇంత నీచస్థితికి దిగజారతారని ఊహించలేదంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. గంభీర్‌పై పలు ఆరోపణలు చేసింది.

గంభీర్ కౌంటర్:

ఇదిలా ఉంటే గంభీర్‌పై అతిషి చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు గౌతమ్ గంభీర్ ‘ నేను స్త్రీలను గౌరవించడంలో ముందుండే వ్యక్తిని.. ఎన్నికల్లో గెలవడానికి ఆప్ పార్టీనే ఇటువంటి చెత్త పనులను చేస్తోంది. మీ బుర్రల్లో మురికిని తుడవాలంటే చీపురు కావాలని అన్నారు. అలాగే తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని, తప్పని తేలితే కేజ్రివాల్, అతిషి రాజకీయాల నుండి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

కాగా ‘సంకరజాతికి అతిషి ప్రత్యక్ష ఉదాహరణ’ అని పాంప్లీట్‌లో రాసి ఉందని ఏఎన్‌ఐ వెల్లడించింది.

×