సైకిల్ దినోత్సవం రోజే…ఫేమస్ సైకిల్ బ్రాండ్ అట్లాస్ కంపెనీ మూతపడింది

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 12:14 PM IST
సైకిల్ దినోత్సవం రోజే…ఫేమస్ సైకిల్ బ్రాండ్ అట్లాస్ కంపెనీ మూతపడింది

ఫేమస్ ఇండియన్ సైకిల్ బ్రాండ్స్ లో ఒకటైన అట్లాస్ కంపెనీ కథ ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజునే ముగిసిపోయింది. భారత్ లో సైకిళ్లు వాడినోళ్లకి,వాడేటోళ్లకి అట్లాస్ బ్రాండ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. భారత్ లో సైకిళ్లకి పర్యాయపదంగా అట్లాస్ సైకిళ్లు పేరుపొందాయి. దేశంలో ఆ విధమైన పాపులారిటీ సంపాదించుకున్న అట్లాస్ కంపెనీ…తన ఆపరేషన్స్ ను జూన్-3న నిలిపివేసింది.

దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని షాహిదాబాద్ లోని తన చివరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను అట్లాస్ కంపెనీ మూసివేసింది. దేశంలోనే అతిపెద్దదైన ఈ ఫ్లాంట్ 1989లో ప్రారంభించబడింది. నెలకు 2లక్షలకు పైగా సైకిళ్లను తయారుచేసే సామర్థం ఉన్న అట్లాస్ సైకిల్ యొక్క చివరి ఆపరేషనల్ ప్లాంట్ ఇది. జూన్-3న ప్రపంచ సైకిల్ దినోత్సవం…అంటే సైకిల్ దినోత్పవం రోజునే ఫేమస్ సైకిల్ కంపెనీ మూతపడిందన్నమాట.

ఫ్యాక్టరీ నడిపేందుకు ఫండ్స్ లేని కారణంగానే యూనిట్ ను మూసివేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే, కంపెనీ షట్ డౌన్ తాత్కాలికమేనని,అదనపు ల్యాండ్ ను అమ్మి 50కోట్ల రూపాయలను పొందిన తర్వాత తమ ఆపరేషన్స్ తిరిగి ప్రారంభమౌతాయని అట్లాస్ కంపెనీ సీఈవో ఎన్ పీ సింగ్ రాణా తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడటంతో 431మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎటువంటి నోటీస్ లేకుండా ఫ్యాక్టరీని మూసివేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

బుధవారం ఫ్యాక్టరీ గేట్స్ కి అతికించిన నోటీస్ లో…..గడిచిన కొన్నేళ్లుగా కంపెనీ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది, ఫ్యాక్టరీని నిలబెట్టేందుకు అన్ని ఫండ్స్ ను ఉపయోగించాం. కానీ ఇప్పుడు ఫండ్స్ అన్నీ అయిపోయాయి. మన రోజువారీ ఆపరేషన్స్ కు నిధులు సమకూర్చడంలో కష్టాలను ఎదర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో ముడిసరుకును కూడా కొనలేకపోతున్నాం. ఫ్యాక్టరీని ఇక నడిపించే స్థాయిలో మేనేజ్ మెంట్ లేదని తెలుపబడింది.

2014నుంచి కంపెనీ నష్టాల పయనం ప్రారంభమైంది. 2014డిసెంబర్ లో కంపెనీ మొదటిసారి మలన్ పూర్ లోని ఫ్లాంట్ ను మూసివేసింది. ఆ తర్వాత హర్యాణాలోని సోనేపట్ ఫిబ్రవరి 2018లో మూసివేసింది. సోనెపట్ ప్లాంట్… 1951 లో జంకిదాస్ కపూర్ చేత స్థాపించబడిన మొదటి యూనిట్. సోనెపట్ వద్ద నిరాడంబరమైన టిన్ షెడ్ నుండి ప్రారంభించి, అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. కేవలం 12 నెలల్లో 25 ఎకరాల ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించింది. అతితక్కువకాలంలోనే భారతదేశపు అతిపెద్ద సైకిల్ తయారీదారుగా అవతరించింది. అంతేకాకుండా 982 లో దేశ రాజధానిలో జరిగిన ఆసియా క్రీడలకు సైకిళ్ల అధికారిక సరఫరాదారు కూడా.

Read: మాస్క్ కట్టుకోకుండా సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీకి జరిమానా