Reserve Bank : ఏటీఎం వద్ద ఓ మనిషి ఎంతసేపు ఓపికగా ఉండగలడు ?..సంచలన విషయాలు

ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.

Reserve Bank : ఏటీఎం వద్ద ఓ మనిషి ఎంతసేపు ఓపికగా ఉండగలడు ?..సంచలన విషయాలు

Atm

ATM Center : నగదు తీసుకోవడానికి ఏ ఓ వ్యక్తి ఏటీఎం దగ్గరకు వెళ్లి..ఓపికగా ఎంత సేపు ఉండగలడు ? అనే దానిపై స్టడీ జరిగింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏటీఎంకు వెళ్లి…కార్డు స్వైపింగ్ మొదలు..డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి కేవలం ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. తర్వాత..ఏదైనా సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదికలో వెల్లడించింది.

Read More : 3D Printed Vaccine : సూది అవసరం లేకుండా టీకా..ఎలా ఇస్తారు ? సాధ్యమేనా ?

రిజర్వ్ బ్యాంకు ఇటీవలే ఓ నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. కార్డు స్వైప్ చేసిన అనంతరం ఏడు సెకండ్లలోపు ట్రాన్సాక్షన్ కాకపోతే…మెషిన్ తిట్టడమో..అటూ ఇటూ చూస్తూ…బ్యాంకులను తిట్టడం చేస్తున్నారంట. ఏటీఎం ఇతర నెట్ వర్క్ లలో ఏదైన సమస్య ఉంటే మాత్రం..ఆలస్యం అవుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఏటీఎం కార్డ్ స్వైపింగ్ లో చాలా ప్రక్రియనే ఉంటుంది. కార్డు పెట్టగానే..అందులో ఉన్న చిప్ లో ఉన్న డాటాను చదువుతుంది. అకౌంట్ నెంబర్, ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ లో ఉందో..ఆ అకౌంట్ లో డబ్బు ఉందా ? లేదా ? అనేది గుర్తిస్తుంది. ఆ బ్యాంకుతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. అందులో ఎంతవరకు డ్రా చేస్తున్నారో..నిర్ధారించాలి. అనంతరం లావాదేవీకి అనుమతినిస్తుంది. ఈ ప్రక్రియ అంతా..కేవలం 1 నుంచి రెండు సెకన్లలో పూర్తి కావాల్సి ఉంటుంది.