PIN ఎంటర్ చేయకుండానే : డబ్బులు కక్కే ATM.. రూ.96 వేలు డ్రా!

మీరు ఏటీఎంలో డబ్బుల డ్రా చేసే సమయంలో ఒక్కసారిగా మిషన్‌లో నుంచి డబ్బులు వచ్చాయా?

  • Published By: sreehari ,Published On : August 27, 2019 / 11:10 AM IST
PIN ఎంటర్ చేయకుండానే : డబ్బులు కక్కే ATM.. రూ.96 వేలు డ్రా!

మీరు ఏటీఎంలో డబ్బుల డ్రా చేసే సమయంలో ఒక్కసారిగా మిషన్‌లో నుంచి డబ్బులు వచ్చాయా?

మీరు ఏటీఎంలో డబ్బుల డ్రా చేసే సమయంలో ఒక్కసారిగా మిషన్‌లో నుంచి డబ్బులు వచ్చాయా? ముంబైలోని ఓ ఏటీఎం నుంచి లక్షల నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. ట్రాన్స్ జెక్షన్ చేయకముందే ఏటీఎంలో నుంచి నోట్ల కట్టలను బయటకు కక్కేస్తోంది. ఆ విషయం తెలియని ఓ మహిళ ముంబైలోని ఓ ఏటీఎం డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. తన ఏటీఎం కార్డుతో స్వైప్ చేసింది. ఇక పిన్ నెంబర్ ఎంటర్ చేయడమే మిగిలింది. అంతలో గ్యాప్ లేకుండా లక్షల నోట్లు బయటకు వచ్చేస్తున్నాయి. 

తాను డ్రా చేసింది కొద్ది మొత్తంలో అయితే రూ.96 వేల వరకు డ్రా అయ్యాయి. అంత డబ్బు బయటకు వచ్చేసరికి సదరు మహిళ షాక్ అయింది. ఆ డబ్బుంతా తన అకౌంట్లో నుంచే విత్ డ్రా అయ్యిందో ఏమోనని బిత్తరపోయింది. చివరికి తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన డబ్బు తన అకౌంట్లోనే ఉందని, బయటకు వచ్చిన డబ్బు తనది కాదని తెలిసి ఊపిరి పీల్చుకుంది. నిజానికి ఇది సాంకేతిక సమస్య. తూర్పు ముంబైలోని అంథేరిలోని ఓ ఏటీఎం దగ్గర ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా ఏటీఎంలో నుంచి ఒక్కసారిగా రూ.96వేల నగదు విత్ డ్రా అయింది. 

అందులో మొత్తం రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. తన అకౌంట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయబోతుండగా.. ట్రాన్స్ జెక్షన్ కంప్లీట్ కాక ముందే ఇలా డబ్బుల కట్టలను కక్కేసింది. రఫిక్వా మెహదివాలా అనే చార్టెడ్ అకౌంట్.. ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా మిషన్ లో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. భయంతో తన ఏటీఎం కార్డును బయటకు లాగేసింది. వెంటనే మరో ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసింది. ఇంతలో ఫస్ట్ ఏటీఎంలో నుంచి రూ.96 వేలు డ్రా అయ్యాయి. ఆ మొత్తాన్ని ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు అప్పగించింది. ఏ బ్యాంకు కూడా ఒకేసారి ఏటీఎం నుంచి లక్షల రూపాయలు డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వదు. 

సాధారణంగా ఒక్కో ట్రాన్స్ జెక్షన్.. రూ.25వేల నుంచి రూ.50వేల వరకు అనుమతి ఇస్తుంది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో ట్రాన్స్ జెక్షన్ ప్రాసెస్ ఆలస్యమైతే.. వెంటనే అక్కడి నుంచి వెళ్లకండి.. ముందుగా మీ ట్రాన్స్ జెక్షన్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే.. ట్రాన్స్ జెక్షన్ క్యాన్సిల్ చేయడంగానీ, క్లియర్ చేయాలి. గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యాక.. అప్పుడే ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వెళ్లాలి. అంటే.. మీ ట్రాన్స్ జెక్షన్ క్యాన్సిల్ అయిందనే నిర్ధారించుకోవాలంటున్నారు నిపుణులు.