ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం: ఆత్మనిర్భర్ భారత్ 3.0

ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం: ఆత్మనిర్భర్ భారత్ 3.0

Atmanirbhar Bharat 3.0: Covid 19 పరిస్థితి నుంచి రికవరీ అవడానికి ఉద్యోగవకాశాలు పెంచాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆత్మ నిర్భర్ యోజనను లాంచ్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త జాబ్‌ల ఏర్పాటు స్కీంలో భాగంగా ఆత్మనిర్భర్ 3.0ను తీసుకురానున్నారు. దేశంలో అత్యవసర జాబ్ సర్వీసులను క్రియేట్ చేస్తుంది.

ఈ జాబ్‌లకు ఈపీఎఫ్ఓ సదుపాయం కూడా ఉంది. ఎవరైతే కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకుంటారో వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. 2020 అక్టోబర్ 1నుంచి ఇది అందుబాటులోకి రానుంది.



* ఎవరైనా కొత్త ఉద్యోగి నెలకు రూ.15వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారు దీని ద్వారా బెనిఫిట్ పొందొచ్చు.
* 2020 మార్చి 1నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో కొవిడ్ మహమ్మారి ప్రభావానికి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఈ స్కీమ్‌లో భాగంగా వెయ్యికి లోపు ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను, సంస్థ చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను మొత్తంగా 24 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదే సమయంలో వెయ్యి కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త వారికి నియమించుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15వేలు లోపు ఉంటేనే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి.

ఈపీఎఫ్ సేవింగ్స్ కలిగి ఉండి సెప్టెంబర్ 2020 కంటే ముందే ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు దీనికి అర్హులు. ఈ స్కీం 2021 జూన్ 30వరకూ అందుబాటులో ఉంటుంది.