Terrorists: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రాగా.. కాకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిని ఏటీఎస్(Anti-Terror Squad) చుట్టుముట్టింది.

Terrorists: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్!

Two Al Qaeda Terrorists

Terrorists: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రాగా.. కాకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిని ఏటీఎస్(Anti-Terror Squad) చుట్టుముట్టింది. అనుమానిత ఉగ్రవాదులను ఇద్దరిని ATS అదుపులోకి తీసుకుంది. ఇద్దరూ కూడా అల్ ఖైదాకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు చెబుతున్నారు. లక్నోలోని కకోరి ప్రాంతంలో ఇద్దరినీ అరెస్టు చేయగా.. వారి నుంచి ప్రెజర్ కుక్కర్ బాంబులు మరియు ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలను సేకరించారు.

ఉగ్రవాదులు ఇద్దరూ ఏదో పెద్ద స్కెచ్ వేసుకుని వచ్చినట్లుగా అర్ధం అవుతోంది. ఇంకా కొంతమంది ఇంట్లో దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్ కకోరి ప్రాంతంపై కమాండోలు మరియు భారీగా పోలీసులతో దాడి చేసింది. ప్రస్తుతం అరెస్టు చేసిన ఇద్దరిపై విచారణ జరుగుతోంది. అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరి పేరు షాహిద్. అతను మాలిహాబాద్ నివాసి అని చెబుతున్నారు. దాడి చేసిన ఇల్లు షాహిద్‌దే. అక్కడే అతను తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మోటారు గ్యారేజీలో పనిచేసేవాడని చెబుతున్నారు.

ప్రెజర్ కుక్కర్ బాంబులు, ఆయుధాలు:
నిందితుడు షాహిద్ ఇంట్లో రెండు ప్రెజర్ కుక్కర్ బాంబులు, తయారు చేస్తున్న టైమ్ బాంబ్ కనుగొన్నారు.ఈ వ్యక్తులు రెండు-మూడు రోజుల్లో ఏదో ఒక పెద్ద బ్లాస్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు అధికారులు.

అల్ ఖైదా ఉత్తరప్రదేశ్ కనెక్షన్ ఏమిటీ?
అల్ ఖైదా స్లీపర్ సెల్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం పట్టుబడుతూనే ఉన్నాయి. వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులతో సహా అన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సైఫుల్లా ఎన్‌కౌంటర్ ఈ ప్రాంతంలో సుమారు మూడేళ్ల క్రితం జరిగింది. 8 మార్చి 2017 న, సుమారు 11 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా చనిపోయాడు. అతని నుంచి కొన్ని ఆయుధాలు మరియు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో ప్రకటించింది ప్రభుత్వం.