అమర జవాను తల్లిపై డాక్టర్ ఔదార్యం..కన్నీటితో ఆశీర్వదించిన అమ్మ

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 03:08 PM IST
అమర జవాను తల్లిపై డాక్టర్ ఔదార్యం..కన్నీటితో ఆశీర్వదించిన అమ్మ

Aurangabad doctor : దేశ రక్షణ కోసం మన జవాన్లు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. కన్నబిడ్డలకు..కన్నవారికి దూరమవుతున్నారు. వారి చేసే త్యాగాలకు మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేం.ఎందుకంటే వారి త్యాగాల వల్లే మనం దేశంలో సురక్షితంగా మనం కుటుంబాలతో జీవించగలుగుతున్నాం. కానీ కన్నబిడ్డలను పోగొట్టుకుని ఆ వేదనను జీవితాతంతం భరిస్తున్నారు ఆ జవానుల్ని కని పెంచి పెద్ద చేసి దేశానికి అప్పగించిన కన్నవారు.



దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరులైన మన జవానుల తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరికీ పట్టదు. కన్నబిడ్డలను పోగొట్టుకున్న కడుపుశోకం ఒకపక్కా…ఆర్థిక కష్టాలను భరించే బాధలు ఓ పక్క మెలిపెట్టేస్తుంటే వారి బాధలు వర్ణనాతీతం. వీరమరణం పొందిన చాలామంది జవానుల కుటుంబాల పరస్థితి అలాగే ఉంటుందనే ఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. కీడ్నీ సమస్యలతో బాధపడే ఆ వీరజవాను తల్లి వైద్యం కూడా చేయించుకోలేని దీన పరిస్థితిలో ఉంది. ఆ తల్లి పట్ల ఓ డాక్టర్ చూపించిన ఔదార్యం..దానికి ఆ తల్లి తెలిపిన కృతజ్ఞతతో కూడిన ఆశీర్వాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



https://10tv.in/missing-spo-joined-militant-ranks/
ఔరంగాబాద్‌ కు చెందిన ఓ జవాను జమ్ముకశ్మీర్‌లో సైనికునిగా విధులు నిర్వహిస్తూ అమరుడయ్యారు. ఆ తరువాత ఆ కుటుంబం ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఈక్రమంతో జవాను తల్లి శాంతాబాయి కిడ్నీ సమస్యలు వచ్చాయి. కానీ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగాబాద్‌లోని ఒక మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ అల్తాఫ్ షేక్ ఆమెకు ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లు తీసివేశారు. తరువాత కూడా ఆమె కోలుకునేవరకూ వైద్యం చేశారు.


కోలుకుని డిశ్చార్జ్ అయ్యే సమయంలో శాంతాభాయి భావోద్వేగానికి గురై డాక్టర్ అల్తాఫ్ షేక్ ను పట్టుకుని ఏడ్చేశారు. కన్నీటితో డాక్టర్ ను హృదయానికి హత్తుకుని కృతజ్ఞతలు తెలిపి ‘‘నాలుగు కాలాల పాటు చల్లగా ఉండు బిడ్డా’’అంటూ ఆశీర్వదించింది.


దీనిపై డాక్టర్ అల్తాఫ్ షేక్ మాట్లాడుతూ..మన కోసం మన దేశం కోసం ఆమె కొడుకు ప్రాణాలు అర్పించాడు. వీర మరణం పొంది వీర జవాను అయ్యాడు. కానీ మనం జవానులు చేసిన త్యాగాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కానీ ఓ జవాన్ ను కని దేశానికి అప్పగించిన ఆ తల్లి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉండటం చాలా దురదృష్టంకరం..విచారకరం..జమ్మూ కశ్మీర్ లో జవానుగా పనిచేసి విధుల్లోనే మరణించిన ఆ తల్లికి నాకు చేతనైన సహాయం చేయటం నా బాధ్యతగా భావించాను..అది నా బాధ్యతే కాదు నా అదృష్టం కూడా అని అన్నారు.


దీనికి సంబంధించిన వీడో వైరల్ గా మారింది. చికిత్స అనంతరం శాంతాబాయి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో భావోద్వేగానికిలోనై డాక్టర్ ను హృదయానికి హత్తుకుంది. నిండుగా ఆశీర్వదించింది. ఈ వీడియోను మహారాష్ట్ర మంత్రి అశోక్ చౌహాన్ కూడా హృదయాలకు హత్తుకునే ఈ వీడియోను రీట్వీట్ చేశారు.