18 ఏళ్లు పాక్ జైల్లో గడిపి..భారత్ కు వచ్చిన హసీనా బేగం ఇకలేరు

18 ఏళ్లు పాక్ జైల్లో గడిపి..భారత్ కు వచ్చిన హసీనా బేగం ఇకలేరు

Aurangabad Woman Who Returned to India After 18 Years in Pakistani Jail Dies of Heart Attack : భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్‌ కు వెళ్లి..18 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్​పోర్ట్​ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఔరంగాబాద్​ పోలీసుల సహకారంతో 2021, జనవరి 26వ తేదీ మంగళవారం స్వస్థలానికి చేరుకున్నారు. స్వర్గంలోకి వచ్చినట్లుంది అని ఆమె అన్నమాటలు ఎక్కువ కాలం నిలువలేదు. గుండెపోటుతో 2021, ఫిబ్రవరి 09వ తేదీ మంగళవారం తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఛాతినొప్పులతో బాధ పడింది. బంధువులు ఓ వైద్యుడిని పిలిపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా..అప్పటికే కన్నుమూశారు.

కొన్నేళ్ల క్రితం ఆమె తన బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్‌ కు వెళ్లారు. పాస్ పోర్ట్ కోల్పోవడంతో సమస్యలు ఎదుర్కొన్నారు. నిరూపించే సాక్ష్యాలు లేకపోవడంతో ఆమె పాక్ చెరలోనే మగ్గాల్సి వచ్చింది. ఆమె ఆదృశ్యం అయినట్లు బంధువులు ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నించారు. చివరకు ఆమె లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు గుర్తించారు. భారత్​కు తిరిగి రావడంలో ఔరంగబాద్​ పోలీసులు సహకరించారు.

2000 సంవత్సరంలో తన ఇంటిని ఎవరో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలుసుకున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఇల్లు తన పేరే ఉందని నిరూపించే పేపర్లను సమర్పించారు. దీని ఆధారంగా పోలీసులు ఆమె భారతీయురాలని రుజువు చేసి పాక్ చెరనుంచి విడిపించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన హసీనా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.