AstraZeneca Vaccine : 60 ఏళ్లు దాటినోళ్లకే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్

60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.

AstraZeneca Vaccine : 60 ఏళ్లు దాటినోళ్లకే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్

Astrazeneca Vaccine

AstraZeneca Vaccine 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. 60 ఏళ్లు దాటినోళ్లకు మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయాలంటూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతున్న ఘటనలు ఆస్ట్రేలియా ఇటీవల వెలుగు చూశాయి. 60 మందిలో రక్తం గడ్డ కట్టినట్టు ప్రభుత్వం దృష్టికి రాగా..వీరిలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్ హట్ తెలిపారు.

కాగా, 5 కోట్ల డోసులను స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియా భారీగా పెట్టుడి పెట్టింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే నిదానంగా నడుస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఓ సవాల్ విసురుతుందని హంట్ అంగీకరించాడు. 2.54 కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో కేవలం మూడు శాతం మందికే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగింది. 60 ఏళ్ల లోపు వయస్సు వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నాక రక్తం గడ్డకట్టిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఏప్రిల్ నెలలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. 50 ఏళ్లు పైబడిన వారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న 52 ఏళ్ల మహిళ రక్తం గడ్డ కట్టి మరిణించిన నేపథ్యంలో గురువారం తాజా ఆదేశాలు జారీ చేసింది స్కాట్ మారిసన్ ప్రభుత్వం. ఇక, ఇప్పటికే పలు యూరప్ దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని వయోధికులకు పరిమితం చేశాయి. యువతలో ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టవచ్చన్న అనుమానాల నేపథ్యంలో యూరప్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.