PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు

భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఖనిజాల రంగంలో ఎంఓయూ కుదిరింది. ఆస్ట్రేలియా నుండి భారత్ మెటాలిక్ బొగ్గు లిథియంను పొందేందుకు ఒప్పందం ఉపయోగపడనుంది.

PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు

Pm Modi

Australian PM Scott Morrison meeting with PM Modi : ప్రధాని మోదీని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ కలిశారు. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ల మధ్య సమావేశం అనంతరం మార్చి 21న భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. భారత్ లో వివిధ రంగాలలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులను ఆస్ట్రేలియా ప్రకటించనుంది. భారత్ లో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టనుంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఖనిజాల రంగంలో ఎంఓయూ కుదిరింది. ఆస్ట్రేలియా నుండి భారత్ మెటాలిక్ బొగ్గు లిథియంను పొందేందుకు ఒప్పందం ఉపయోగపడనుంది. ఈ నెలాఖరులోగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురనుంది. త్వరలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.

Indian – Japan: జపాన్ ప్రధాని భారత్ పర్యటన: రెండో రోజు యుక్రెయిన్, చైనా అంశాలపై చర్చ

మరోవైపు జపాన్ కూడా భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. భారత్, జపాన్ ప్రధానుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఐదేళ్లలో జపాన్.. భారత్ లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టబడులను పెడుతుందని ప్రధాని మోదీ తెలిపారు.

భారత్-జపాన్ భాగస్వామ్యం మరింత బలోపేతం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచ స్థాయిలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం గురించి ఇరుదేశాలు ప్రకటించగా.. 2 దేశాల మొత్తం 6 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

రెండు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా 14వ భారత్​- జపాన్​ ద్వైపాక్షిక సదస్సులో ఫుమియో కిషిదా, మోదీ శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ ​హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడంతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు వీలుగా ఆరు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.