Auto Driver In Ranchi : కోవిడ్ రోగులకు ఫ్రీగా ప్రయాణం ఆటోడ్రైవర్ మానవత్వం

కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.

Auto Driver In Ranchi : కోవిడ్ రోగులకు ఫ్రీగా ప్రయాణం ఆటోడ్రైవర్ మానవత్వం

Auto Driver

Free Rides To People : కరోనా సోకిందంటే చాలు..తల్లి, తండ్రి, తమ వారేనని కొంతమంది చూడడం లేదు. వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అందరూ ఉన్నా అనాథగా బతకాల్సి వస్తోంది. కోవిడ్ సోకిందంటే..చాలు అమాంతం ఆమడదూరం పరుగెత్తుతున్నారు. ఈ వైరస్ మనుషుల మధ్యనున్న బంధం చంపుతుంటే..కొంతమంది మాత్రం మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కరోనా రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దండుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ లో ఇంజక్షన్, ఆక్సిజన్ సిలిండర్లను కూడా విక్రయిస్తున్నారు. కానీ..తాను మాత్రం అలాంటి వ్యకి కాదంటున్నాడు. తనలో ఇంకా మానవత్వం దాగి ఉందని నిరూపిస్తున్నాడు. కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. అంతేగాదు..ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ ను పెట్టాడు. ఆటోకు కూడా ఫోన్ నెంబర్ తో ఉన్న పోస్టర్ ని అతికించాడు.

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే..కోవిడ్ రోగులను హాస్పిటల్ కు తీసుకెళుతానని, వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయనని చెబుతున్నాడు. ఈనెల 15వ తేదీన ఓ మహిళకు కరోనా సోకితే..తాను ఆసుపత్రిలో దింపిన తర్వాత..ఆమెను తిరిగి ఎవరూ తీసుకెళ్లడానికి ముందుకు రాలేదన్నాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మానవత్వంతో ఆటోడ్రైవర్ చేస్తున్న సహాయానికి ప్రశంసలు అందచేస్తున్నారు.

Read More : UP’s Hamirpur : ఆ బాధను అనుభవించాను..ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్