Video Viral : రైలుకు ఎదురుగా నిలబడిన యువతి..ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే

ట్రైన్ సౌండ్ వినిపించగానే...క్రాసింగ్ దాటి...పట్టాలపైకి వెళ్లింది. కరెక్టుగా ఇక రైలు వస్తుందనగా...ఎదురుగా నిలబడింది.

Video Viral : రైలుకు ఎదురుగా నిలబడిన యువతి..ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే

Auto Driver

Auto Driver Saves Woman : జీవితంలో సమస్యలు ఎదురుకాగానే..ధైర్యంగా ఎదుర్కోకోక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కుటుంబంతో సహా..సూసైడ్ చేసుకుంటుంటారు. దీంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని నిపుణులు వెల్లడిస్తుంటారు. ఇలాగే..ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించగా..ఆటో డ్రైవర్ ధైర్యంగా కాపాడాడు. ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆటోడ్రైవర్ చూపిన సాహసాన్ని అంతా మెచ్చుకుంటుండగా..ఆత్మహత్య పరిష్కారం కాదని ఆ యువతికి ధైర్యం చెబుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Tollywood : టాలీవుడ్ లో విషాదం.. సినిమా పై కలలు.. అంతలోనే ఆత్మహత్య..

ఓ రైలు వస్తుండడంతో అక్కడున్న సిబ్బంది క్రాసింగ్ వేసేశారు. దీంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులతో పాటు ఓ యువతి అక్కడనే నిల్చొని ఉంది. ఆమె ఎందుకు నిలబడిందో..తెలియక..ఆటోలో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడం ప్రారంభించాడు. ట్రైన్ సౌండ్ వినిపించగానే…క్రాసింగ్ దాటి…పట్టాలపైకి వెళ్లింది. కరెక్టుగా ఇక రైలు వస్తుందనగా…ఎదురుగా నిలబడింది. వెంటనే ఆటో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఆటో..దిగి..పరుగున..ఆ యువతి వద్దకు పరుగెత్తాడు. క్షణం ఆలస్యం చేయకుండా..ఆ యువతిని పట్టుకుని..లాగాడు.

Read More : Memory : కరోనా మృతుల కోసం..మెసేజ్‌ రాసిన 6 లక్షల తెల్ల జెండాలు..

అలాగే..వెనక్కి లాక్కొచ్చాడు. ఆత్మహత్య చేసుకోవద్దని..ఆ యువతికి అక్కడున్న వారు నచ్చచెప్పారు. యువతి కిందకూర్చొని ఎడవగా..ఆమెకు ధైర్యం చెప్పారు. Ravish Pal Singh అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. సమస్యలకు సూసైడ్ సొల్యూషన్ కాదని క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు చాలా మంది ఆటోడ్రైవర్ ను మెచ్చుకున్నారు. సడెన్ గా ఆలోచించి..ధైర్యంగా ఆమెను కాపాడారంటూ ప్రశంసించారు. అంతేగాకుండ..ఆ యువతికి ధైర్యం చెప్పారు.