Onam Lottery : ఈ ఆటో డ్రైవర్ ఎంత అదృష్టవంతుడో.. లాటరీలో రూ.12 కోట్లు

ఆటో డ్రైవర్ ఒక్క రోజులోనే కోటీశ్వరుడైపోయాడు. కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కి రూ.12 కోట్ల విలువైన లాటరీ తగిలింది.

10TV Telugu News

Onam Lottery : ఆటో డ్రైవర్ల గురించి అందరికి తెలిసిందే.. రోజంతా కష్టపడితే 500 నుంచి 600 వస్తాయి. కొందరికి అవికూడా కష్టమే.. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం ఒక్కరోజులోనే రూ. 12 కోట్లు సంపాదించాడు కానీ ఆటో నడిపి కాదు.. లాటరీ ద్వారా.. పక్కింట్లొళ్ళు లాటరీ కొంటుంటే అది చూసి తాను ఓ లాటరీ కొన్నాడు. తాజాగా తీసిన లక్కీడ్రా విజేతగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రం కొచ్చిలోని మరడు పూప్పనపరంబిల్ హౌస్ నివాసి జయపాలన్ పిఆర్. ఈయన ఆటో నడుపుతాడు.

Read More : Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

ఆటో నడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటాడు జయపాలన్.. ఆయనకు 95 తల్లీ, భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దీ రోజులక్రితం రూ. 300 పెట్టి తిరువోనం బంపర్ బిఆర్ -81 లాటరీ కొనుగోలు చేశాడు జయపాలన్.. ఆ లాటరీ లక్కీడ్రా ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఆటో డ్రైవర్ జయపాలన్ నంబర్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనసలు లాటరీ వస్తుందని ఊహించలేదని.. పక్కింటివారు కొంటుంటే కొన్నానని తెలిపాడు.

Read More : Canada : కెనడా ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు విజయం

ఇక వచ్చిన లాటరీ డబ్బులతో తనకు ఉన్న అప్పులు తీర్చుకుంటానని మిగిలిన దానిపై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా ఈ రూ. 12 కోట్ల లాటరీలో టాక్స్ లు. ఏజెంట్ కమీషన్ పోను జయపాలన్ సుమారు రూ .7.39 కోట్లు పొందవచ్చు.