అవెంజర్స్ ను ప్రస్తావిస్తూ రైల్వే శాఖ ట్వీట్లు

రైల్వే ట్రాక్స్‌ను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని..‘ఇక్కడ మీ జీవితాన్ని కాపాడేందుకు అవెంజర్స్ ఎవరూ రారు.

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 08:29 AM IST
అవెంజర్స్ ను ప్రస్తావిస్తూ రైల్వే శాఖ ట్వీట్లు

రైల్వే ట్రాక్స్‌ను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని..‘ఇక్కడ మీ జీవితాన్ని కాపాడేందుకు అవెంజర్స్ ఎవరూ రారు.

‘అవెంజర్స్’ మానియా నడుస్తోంది. ఈ మానియాను రైల్వే శాఖ బీభత్సంగా వాడేసుకుంటోంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా..అవెంజర్స్ మానియా అంతా ఇంతా కాదు. కోట్లాది మంది హృదయాలను కొల్లగొడుతోంది.

ఈ క్రమంలో భారత రైల్వేస్ కూడా అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాను వాడేస్తోంది. ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఈ సినిమాలో సూపర్ హీరోలను చూపిస్తూ.. వెస్ట్రన్ రైల్వేస్ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. రైల్వే ట్రాక్స్‌ను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేసింది. 

‘ఇక్కడ మీ జీవితాన్ని కాపాడేందుకు అవెంజర్స్ ఎవరూ రారు. మీ రక్షణ బాధ్యత మీదే అంటు సూచిస్తూనే హెచ్చరిస్తోంది. సురక్షితమైన మార్గంలో వెళ్లమని చెబుతోంది. దయచేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, ఎస్కలేటర్లను ఉపయోగించమంటు రైల్వే ట్రాక్స్‌ను నేరుగా దాటొద్దు’ అని ట్వీట్ చేసింది. రైల్వే ట్రాక్‌లను దాటితే ప్రమాదమంటు హెచ్చరించింది. వెస్ట్రన్ రైల్వేస్ చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు వైరల్ గా మారాయి.