కట్నం వద్దంటున్న ముస్లిం మత పెద్దలు

కట్నం తేవాలంటూ భర్త, అత్తింటి వారు చేసిన వేధింపుల కారణంగా గుజరాత్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కట్నం వద్దంటున్న ముస్లిం మత పెద్దలు

Ayesha

Ayesha Suicide Case : పెళ్లిళ్లలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం చేయెద్దంటూ ముస్లిం మత పెద్దలు పిలుపు నిచ్చారు. ఇకపై ముస్లింలు కట్నం ప్రసక్తి లేకుండా పెళ్లిలు నిర్వహించాలంటూ ప్రచారం చేస్తున్నారు. కట్నం తీసుకోవడం ముస్లిం షరియా న్యాయాలకు వ్యతిరేకమంటూ చెబుతున్నారు ముస్లిం మత పెద్దలు. కట్నం తేవాలంటూ భర్త, అత్తింటి వారు చేసిన వేధింపుల కారణంగా గుజరాత్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందిన ఆయేషా భానుకి రాజస్థాన్‌లోన జాలోర్‌కి చెందిన ఆరీఫ్‌ ఖాన్‌తో నిఖా జరిగింది. ఆ తర్వాత కట్నం కోసం భర్త ఆరీఫ్‌తో పాటు అత్తమామాలు నిత్యం వేధింపులకు గురి చేసేవారు. ఇంట్లో బంధించడం, తిండి పెట్టకపోవడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు. ఈ ఆగడాలపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది ఆయేషా. అయితే భర్త నుంచి వేధింపులు ఆగకపోవడంతో … చివరకు సబర్మతి నదిలో బోటింగ్‌ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడింది.

అంతకు ముందు భర్తకు వీడియో కాల్‌ చేసి తన కష్టాలు చెప్పుకుంది ఆయేషా. ఆ వీడియో కాల్‌ గుజరాత్‌లో సంచలనం రేపింది. వరకట్న పిశాచి అసలు రూపాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఆయేషా ఆత్మహత్య గుజరాత్‌లో ముస్లిం మత పెద్దలను కదిలించింది. దీంతో ముస్లిం పెళ్లిల్లో ఎవరూ కట్నం ఇవ్వడం, తీసుకోవడం చేయోద్దంటూ ప్రచారం చేస్తున్నారు. వాల్‌ పోస్టర్లు ఊరంతా అంటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.