అయోధ్య కేసు జనవరి 29కి వాయిదా

అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.

  • Published By: sreehari ,Published On : January 10, 2019 / 06:25 AM IST
అయోధ్య కేసు జనవరి 29కి వాయిదా

అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.

న్యూఢిల్లీ: అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది. ఈ కేసుపై వాదనలు ప్రారంభమైన సమయంలో ఐదుగురు జడ్జీల్లో ఒకరైన జడ్జీ యుయు లలిత్ విచారణ నుంచి తప్పుకోవడంతో మళ్లీ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసును జనవరి 29కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసు విషయమై కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది.

ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య కేసుపై విచారించేందుకు ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎస్ఏ బోదే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డివై చంద్రచూఢ్ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో జస్టిస్ లలిత్ బెంచ్ లో ఉండటంపై మరో సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో ఇదే కేసులో మరొకరి తరపున లలిత్ న్యాయవాదిగా వాదనలు వినిపించారు.