అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం 

  • Published By: chvmurthy ,Published On : March 9, 2019 / 01:12 PM IST
అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం 

ముంబై : అయోధ్య సమస్య  మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి  ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన  పార్టీ స్పృష్టం చేసింది.  అయోధ్య సమస్యను  రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో  మధ్యవర్తులు సమస్యను ఎలా పరిష్కరిస్తారని  పార్టీ ప్రశ్నించింది.  రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదం భావోద్వేగాలకు సంబంధించిన అంశమని  కేంద్ర దీనిపై ఆర్డినెన్స్ తీసుకువచ్చి  మందిర నిర్మాణం చేపట్టాలని శివసేన అధికార పత్రిక సామ్నాలో డిమాండ్ చేసింది. 

అయోధ్య వివాద పరిష్కారం కోసం ఇటీవల సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎమ్‌ఐ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా కమిటీని నియమించింది. మధ్యవర్తులతో సమస్య పరిష్కారం అయ్యేదైతే పాతికేళ్ళుగా ఎందుకు  వివాదాంగానే ఎందుకు ఉండి పోయిందని పార్టీ ప్రశ్నించింది. రామజన్మ భూమి వివాదం  లోక్ సభ ఎన్నికల తర్వాత పరిష్కారం అవుతుందని పార్టీ అభిప్రాయ పడింది. 
Read Also : అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తాం: రాహుల్ గాంధీ