Maulvi Faizabadi : అయోధ్య మసీదుకి ఆయన పేరు!

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య జిల్లాలోని ధనిపుర్​ గ్రామంలో 5ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు, హాస్పిటల్ కాంప్లెక్స్​కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు.

Maulvi Faizabadi : అయోధ్య మసీదుకి ఆయన పేరు!

Maulvi Faizabadi

Maulvi Faizabadi ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య జిల్లాలోని ధనిపుర్​ గ్రామంలో 5ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు, హాస్పిటల్ కాంప్లెక్స్​కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మిస్తున్న మసీదు,హాస్పిటల్ కాంప్లెకి దేశ విముక్తి కోసం పోరాటం చేసి, 164 ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన మౌల్వి అహ్మదుల్లా షా ఫైజాబాది పేరుని పెట్టనున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(IICF)శనివారం ఓ ప్రకటనలో తెలిపింది ఈ ప్రాజెక్టులోని మసీదు, హాస్పిటల్, మ్యూజియం, పరిశోధన కేంద్రం, కమ్యూనిటీ కిచెన్​లను ఫైజాబాదికి అంకితమివ్వనున్నట్లు ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​ తెలిపింది.

1857 తిరుగుబాటులో రెండేళ్ల పాటు అవ‌ధ్‌ ప్రాంతాన్ని బ్రిటీష‌ర్ల నుంచి కాపాడిన యోధుడు ఫైజాబాదీ. ఈయ‌న‌నే లైట్‌హౌజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. ఆయ‌న అమ‌రుడైన రోజున.. ఈ ప్రాజెక్ట్ మొత్తానికీ ఫైజాబాదీ పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి ఆథ‌ర్ హుస్సేన్ చెప్పారు. అందుకే గ‌త జ‌న‌వ‌రిలో ఇక్క‌డి రీసెర్చ్ సెంట‌ర్‌ను ఆయ‌న‌కు అంకిత‌మిచ్చినట్లు తెలిపారు. తొలి స్వాతంత్య్ర స‌మ‌రం జరిగి 160 ఏళ్ల‌యినా భార‌త చ‌రిత్ర‌లో ఫైజాబాదీకి త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఫైజాబాద్​లోని సరాయ్​ మసీదు ఆయన పేరుతో ఉన్న ఏకైక భవనం అని తెలిపారు. 2019 నవంబ‌ర్‌లో సుప్రీంకోర్టు త‌న తీర్పులో ఈ ఐదు ఎక‌రాల భూమిని మసీదు కోసం కేటాయించిన విష‌యం తెలిసిందే. సున్నీ వ‌క్ఫ్ బోర్డు ఈ మ‌సీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. అయితే మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ పేరు మాత్రం దీనికి పెట్ట‌కూడ‌ద‌ని ఈ ట్ర‌స్ట్ గ‌తంలోనే నిర్ణ‌యించింది.

కాగా,అయోధ్య మసీదు, ఆసుపత్రి ప్రాజెక్టును ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. వారికి ఆ స్థలం కేటాయించాలని 2019 నవంబర్​లో సుప్రీం కోర్టు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సున్నీ వ‌క్ఫ్ బోర్డు ఈ మ‌సీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. అయితే మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ పేరు మాత్రం దీనికి పెట్ట‌కూడ‌ద‌ని ఈ ట్ర‌స్ట్ గ‌తంలోనే నిర్ణ‌యించింది.