మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2019 / 08:41 AM IST
మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

అయోధ్య ల్యాండ్ వివాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్నదానిపై తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం(మార్చి-6,2019) విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే,జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్,జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం..మధ్యవర్తి నియాకంపై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ లో పెడుతున్నట్లు తెలిపింది. 
కోర్టు ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వానికి ముస్లిం గ్రూపులు సమర్థించగా హిందూత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. యూపీ ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని, మధ్యవర్తికి అప్పగించేలా కనుక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే ఇరుపక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తెలిపారు.ఈ కేసు కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదని..రెండు మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన విషయమని,మొఘల్ రాజ్ బాబర్ ఏం చేశారు, ఆ తర్వాత ఏంజరిగిందనే దానితో తమకు సంబంధం లేదనీ… ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానిపైనే తాము దృష్టిపెట్టగలమని సమస్య పరిష్కారానికి ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని తాయు భావిస్తున్నట్లు జస్టిస్ బోబ్డే తెలిపారు.