రామాలయం భూమి పూజ : మోడీ దూరదృష్టితో కల నెరవేరింది – యోగి ఆదిత్య నాథ్

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 01:40 PM IST
రామాలయం భూమి పూజ : మోడీ దూరదృష్టితో కల నెరవేరింది – యోగి ఆదిత్య నాథ్

అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణం శంకుస్థాపన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టితో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కల సాకారం అయ్యిందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. రామాలయ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.



రామాలయ నిర్మాణం కోసం 5 దశబ్దాలుగా నిరీక్షించామన్నారు. రామాలయం కోసం సుదీర్భంగా పోరాటం జరిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం అయోధ్యలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా..రామాలయ ఆలయ నిర్మాణ శంకుస్థాపన జరిగింది.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై యూపీ సీఎం మాట్లాడుతూ…

ఎందరో త్యాగాల ఫలితమే రామ మందిరం సాకారమైందని, అయోధ్య రామాలయ భూ వివాదం..ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సమస్య పరిష్కారమైందని తెలిపారు. బుధవారం 113 కోట్ల మంది భారతీయుల కల నెరవేరిందని తెలిపారు.



అయోధ్యలో జరుగుతున్న ఈ వేడుకకు ఎంతో మంది రావాల్సి ఉందని, కరోనా నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారని తెలిపారు. భూమి పూజ కార్యక్రమం సందర్భంగా యూపీలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మోడీ ఆధ్వర్యంలో అయోధ్యలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయన్నారు.